Ranveer Nude Pic: రణ్‌వీర్ న్యూడ్ ఫొటో ఫొటోపై దీపిక రియాక్షన్ ఏంటో తెలుసా?-deepika padukone reaction on ranveer singh nude photo ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Deepika Padukone Reaction On Ranveer Singh Nude Photo

Ranveer Nude Pic: రణ్‌వీర్ న్యూడ్ ఫొటో ఫొటోపై దీపిక రియాక్షన్ ఏంటో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Jul 22, 2022 08:19 PM IST

రణ్‌వీర్ సింగ్ తాజాగా దిగిన న్యూడ్ ఫొటోపై దీపికా పదుకొణే ఆనందం వ్యక్తం చేసిందట. ఈ విషయాన్ని వారి సన్నిహిత వర్గాలు తెలిపారు. ప్రస్తుతం అతడు దిగిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రణ్‌వీర్ ఫొటోపై దీపిక రియాక్షన్
రణ్‌వీర్ ఫొటోపై దీపిక రియాక్షన్ (Twitter)

రణ్‌వీర్ సింగ్ నగ్న చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా అతడు దిగిన ఫొటోపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. దీంతో మీమర్స్ కూడా ఇప్పటికే రణ్‌వీర్ ఫొటోపై మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. నెట్టింట పెద్ద దుమారం రేపుతున్న ఈ ఫొటోపై సెలబ్రెటీల కూడా వైవిధ్యంగా స్పందిస్తున్నారు. కొంతమంది సానుకూలంగా స్పందిస్తుంటే.. మరికొంతమంది వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే రణ్‌వీర్ భార్య, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? రణ్‌వీర్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ చాలా హ్యాపీగా ఫీలైందని తెలుస్తోంది.

"రణ్‌వీర్‌‌ను ఫొటోను చూసిన దీపిక తెగ సంతోషపడింది. ఈ ఫొటో షూట్ గురించి మొదటి నుంచి ఆమెకు తెలుసు. అంతేకాకుండా ఈ కాన్సెప్టును విన్న వెంటనే ఆమె ఇష్టపడింది. దీపిక ఎల్లప్పుడూ రణ్‌వీర్‌కు మద్దతుగా ఉంటూ.. అతిడిని ఛాంపియన్‌గా నిలబెట్టింది. కాస్త భిన్నంగా ఉండేందుకు ఇష్టపడే రణ్‌వీర్‌కు ఈ విషయంలోనూ మద్దతు ఇచ్చింది అని" ఈ బాలీవుడ్ దంపతుల సన్నిహితుల్లో ఒకరు తెలిపారు.

ఈ ఫొటోషూట్ గురించి రణ్‌వీర్ ముందు నుంచే ప్లాన్ చేశాడని వారు తెలిపారు. వైవిధ్యమైన ఫ్యాషన్ ఆప్షన్లను ఎంచుకునే రణ్‌వీర్ ఈ సారి నగ్న చిత్రాలను తీయించుకున్నాడనే విషయంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని స్పష్టం చేశారు. తన శరీరం, చర్మంతో అతడు ఎంతో సౌకర్యంగా ఉంటాడని పేర్కొన్నారు.

ఒకప్పుడు బర్ట్‌ రేనాల్డ్స్‌ ఫొటోషూట్ స్టైల్లోనే ఇప్పుడు రణ్‌వీర్‌ న్యూడ్‌గా కెమెరా ముందు పోజులిచ్చాడు. ఈ మ్యాగజైన్‌కు రణ్‌వీర్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలు, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాడు.

"భౌతికంగా నగ్నంగా ఉండటం నాకు చాలా ఈజీ. అయితే ఇప్పటి వరకూ నేను సినిమాల్లో చేసిన పర్ఫార్మెన్స్‌లలోనూ నగ్నంగానే ఉన్నాను. అందులో మీరు నగ్నంగా ఉన్న నా ఆత్మను చూడొచ్చు. నిజానికి అదీ నగ్నత్వం అంటే. నేను వేయి మంది ముందు కూడా నగ్నంగా నిలబడగలను. నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. వాళ్లే కాస్త అసౌకర్యానికి గురవుతారు" అని తన ఇంటర్వ్యూలో రణ్‌వీర్‌ అనడం విశేషం.

IPL_Entry_Point

సంబంధిత కథనం