Telugu News  /  Entertainment  /  Chembur Police Registered Case Against Ranveer Singh Over His Nude Photoshoot
రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్ ఫొటోషూట్
రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్ ఫొటోషూట్ (Instagram)

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటోషూట్‌.. కేసు నమోదు చేసిన పోలీసులు

26 July 2022, 15:03 ISTHT Telugu Desk
26 July 2022, 15:03 IST

Ranveer Singh: బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. ఈ మధ్యే న్యూడ్‌ ఫొటోషూట్‌ చేసిన అతనిపై ఎంతోమంది ఫిర్యాదులు చేస్తుండగా.. తాజాగా కేసు కూడా నమోదైంది.

రణ్‌వీర్‌ సింగ్‌ న్యూడ్‌ ఫొటోలు ఈ మధ్య ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. పేపర్‌ అనే మ్యాగజైన్‌ కవర్‌ కోసం అతడు ఒంటిపై నూలిపోగు కూడా లేకుండా ఫొటోలకు పోజులిచ్చాడు. అయితే ఇదే ఇప్పుడతన్ని చిక్కుల్లో పడేసింది. రణ్‌వీర్‌పై చెంబూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై ఐపీసీ సెక్షన్లు 292, 293, 509లతోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67(ఎ) కింద కేసు పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

ముంబైకి చెందిన లాయర్‌ వేదికా చౌబే రాతపూర్వక ఫిర్యాదు మేరకు చెంబూర్‌ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తన ఫొటోలతో మహిళల మనోభావాలను రణ్‌వీర్‌ దెబ్బతీశాడని, వాళ్లను అవమానించాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. సదరు లాయర్‌తోపాటు ఓ ఎన్జీవో, మాజీ జర్నలిస్ట్‌ కూడా చెంబూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఫిర్యాదు చేశారు.

బాలీవుడ్‌ నటి దీపికా పదుకోన్‌ భర్త అయిన రణ్‌వీర్‌ ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించి స్టార్‌ హీరోగా ఎదిగాడు. పేపర్‌ అనే మ్యాగజైన్‌ కోసం చేసిన ఈ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోను రణ్‌వీర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోలపై అతని భార్య దీపికాతోపాటు పలువురు అభిమానులు ప్రశంసలు కురిపించగా.. మరికొందరు షాక్‌కు గురయ్యారు.

ఈ పేపర్‌ మ్యాగజైన్‌కు రణ్‌వీర్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎంత కష్టపడి ఈ స్థాయికి చేరానో అతడు వివరించాడు. తన గురించి ఎవరేమనుకున్నా పెద్దగా పట్టించుకోనని, ఇప్పటికీ కెరీర్‌లో ఎదగడానికి తానెంతో కష్టపడతానని అతడు చెప్పాడు. ఈ మధ్యే జయేష్‌భాయ్‌ జోర్దార్‌ మూవీలో కనిపించిన రణ్‌వీర్‌.. తర్వాత రోహిత్‌శెట్టి డైరెక్షన్‌లో వస్తున్న సర్కస్‌లో నటిస్తున్నాడు.