తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajinikanth On Kantara: 50 ఏళ్లకోసారి వచ్చే సినిమా కాంతారా అంటూ రిషబ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన రజనీకాంత్‌

Rajinikanth On Kantara: 50 ఏళ్లకోసారి వచ్చే సినిమా కాంతారా అంటూ రిషబ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చిన రజనీకాంత్‌

HT Telugu Desk HT Telugu

16 November 2022, 14:36 IST

    • Rajinikanth On Kantara: 50 ఏళ్లకోసారి వచ్చే సినిమా కాంతారా అంటూ రిషబ్‌శెట్టికి కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చాడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఈ మూవీపై గతంలోనూ అతడు ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
రిషబ్ శెట్టిని సన్మానిస్తున్న రజనీకాంత్
రిషబ్ శెట్టిని సన్మానిస్తున్న రజనీకాంత్ (twitter)

రిషబ్ శెట్టిని సన్మానిస్తున్న రజనీకాంత్

Rajinikanth On Kantara: కన్నడ మూవీ కాంతారాపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. ఇది 50 ఏళ్లకోసారి వచ్చే సినిమా అంటూ కొనియాడాడు. అంతేకాదు ఈ మూవీలో నటించి, డైరెక్ట్‌ చేసిన రిషబ్‌ శెట్టికి కాస్ట్‌లీ గిఫ్ట్‌ కూడా ఇచ్చాడు. ఈ సినిమా రిలీజై సుమారు 50 రోజులు కావొస్తున్నా.. క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు.

ట్రెండింగ్ వార్తలు

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

గతంలోనే ఓసారి కాంతారా మూవీ చూసి తనకీ సినిమా గూస్‌బంప్స్‌ తెప్పించిందని రజనీకాంత్‌ అన్నాడు. ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమాపై స్పందించాడు. 50 ఏళ్లకోసారిగానీ ఇలాంటి సినిమా రాదంటూ రిషబ్‌ శెట్టికి ఖరీదైన గోల్డ్‌ చెయిన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం విశేషం. కాంతారా చూసి దానిపై ట్విటర్‌లో రజనీ తొలిసారి స్పందించిన వెంటనే అతని ఇంటికి వెళ్లి మరీ కలిశాడు రిషబ్‌ శెట్టి.

ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ అతన్ని సన్మానించాడు. అద్భుతమైన సినిమా తీశావంటూ అభినందించాడు. తన నటన, డైరెక్షన్‌తో రజనీనే రిషబ్ కట్టిపడేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లోనూ ఓ సినిమా వస్తుందా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. గత నెల 26న రజనీకాంత్‌ ఈ కాంతారా మూవీపై తొలిసారి స్పందించాడు.

అప్పుడే సినిమా చూసిన అతడు.. ఓ రైటర్‌, డైరెక్టర్‌, నటుడిగా రిషబ్ శెట్టి నీకు హ్యాట్సాఫ్.. ఇండియన్‌ సినిమా మాస్టర్‌ పీస్‌ ఇది. నాకు గూస్‌బంప్స్‌ తెప్పించింది అంటూ రజనీ ట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత రజనీ ఇంటికి రిషబ్ వెళ్లాడు. అక్టోబర్‌ 29న చెన్నైలోని రజనీకాంత్‌ ఇంటికి వెళ్లిన రిషబ్‌.. సూపర్‌స్టార్‌ తనపై పొగడ్తల వర్షం కురిపించడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

సెప్టెంబర్‌ 30న కేవలం కన్నడలో మాత్రమే ఓ చిన్న సినిమాగా రిలీజైన కాంతారా తర్వాత ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీల్లోనూ రిలీజై బాక్సాఫీస్‌ దగ్గర దుమ్ము రేపింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా కొల్లగొట్టింది. కేజీఎఫ్‌ మూవీని నిర్మించిన హోంబెల ఫిల్మ్సే ఈ సినిమాను కూడా రూపొందించడం విశేషం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.