Rishab Shetty comments: బాలీవుడ్‌పై కాంతారా హీరో రిషబ్ శెట్టి సంచలన కామెంట్స్-kanatara film maker rishab shetty comments on bollywood over film backdrop ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rishab Shetty Comments: బాలీవుడ్‌పై కాంతారా హీరో రిషబ్ శెట్టి సంచలన కామెంట్స్

Rishab Shetty comments: బాలీవుడ్‌పై కాంతారా హీరో రిషబ్ శెట్టి సంచలన కామెంట్స్

HT Telugu Desk HT Telugu
Nov 06, 2022 08:47 AM IST

Kantara’s Rishab Shetty: రిషబ్ శెట్టి బాలీవుడ్‌పై సంచలన కామెంట్స్ చేశారు.

కాంతారా చిత్రంలోని ఓ దృశ్యం
కాంతారా చిత్రంలోని ఓ దృశ్యం

కాంతారా విజయం ఒక అద్భుతం. ప్రాంతీయ జానపదాలు, ఆచారాల ఆధారంగా రూ. 16 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం అద్భుత విజయం సాధించి దేశ చిత్ర పరిశ్రమ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు చేసిన రెండో కన్నడ చిత్రంగా, అలాగే 2022లో అత్యధికంగా వసూలు చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ చిత్ర కథానాయకుడు, డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ విజయం స్థానిక సంస్కృతిని తెరకెక్కించడం ద్వారా సాధ్యమైందంటారు. రిషబ్ శెట్టి కర్ణాటక తీరప్రాంతానికి చెందినవారు. హిందుస్తాన్ టైమ్స్‌తో ఆయన ముచ్చటించారు. కాంతారా చిత్రాన్ని రీమేక్ చేయొచ్చా? హిందీ చిత్ర పరిశ్రమ దక్షిణాది చిత్రాల తరహాలో ఎందుకు విజయవంతమైన చిత్రాలను తేలేకపోతోందనే అంశాలపై ఆయన మాట్లాడారు.

కాంతారా పాన్ ఇండియా సక్సెస్‌గా నిలవడంతో ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి తగిన కథావస్తువుగా చర్చ జరిగింది. కానీ రిషబ్ దీనిపై రిషబ్ మాట్లాడుతూ ‘అలా జరుగుతుందని నేను ఊహించలేను..’ అని వ్యాఖ్యానించారు.

‘నేను కథ రాసేటప్పుడు తగిన నేపథ్యాన్ని ఎంచుకుంటా. నేను చూసిన ప్రపంచం నుంచే అది ఉంటుంది. కాంతారాను చూస్తే అది చాలా సింపుల్ స్టోరీ. ఒక కథానాయకుడు ఉంటాడు. ఒక విలన్ ఉంటాడు. రొమాన్స్ కూడా ఉంటుంది. ఇతర రెగ్యులర్ అంశాలూ ఉంటాయి. ఇందులో కొత్త విషయం ఏంటంటే దాని నేపథ్యం. దాన్ని చుట్టుకుని ఉన్న పొరలు, దానిని మలిచిన తీరు కొత్తగా ఉంటాయి. ఇది మా గ్రామ కథ. నేను చిన్నప్పటి నుంచి చూసినదే. దానినే నేను ప్రెజెంట్ చేశాను. గ్రామీణ లోతుల్లోకి వెళితే ఆ కథ విశ్వవ్యాప్తమవుతుందని నేను ఎప్పుడూ చెబుతుంటాను..’ అని వివరించారు. చిత్ర దర్శకుడు ఈ ఫీల్‌ను పట్టుకుంటే, తన ప్రాంతంలోని కల్చర్‌ను చక్కగా ప్రజెంట్ చేయొచ్చు. అప్పుడు అది ఫలిస్తుండొచ్చు. కానీ ఇలాగే అవుతుందని నేను చెప్పలేదను..’ అని వివరించారు.

తమ సొంత ప్రాంతం గురించి, తెలిసిన ప్రపంచం గురించి ఆకట్టుకునేలా ప్రజెంట్ చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందవచ్చని రిషబ్ శెట్టి మాటల్లో అర్థమైంది. ఈ విధానాన్ని బాలీవుడ్ దర్శకులు ఈరోజుల్లో మరిచిపోతున్నారని రిషబ్ శెట్టి అన్నారు.

‘మేం ప్రేక్షకుల కోసం సినిమా తీస్తాం. మా కోసం కాదు. ప్రేక్షకులను, వారి సెంటిమెంట్లను మైండ్‌లో పెట్టకుని సినిమా తీయాలి. వారి విలువలు, వారి జీవన విధానాన్ని దృష్టిలో పెట్టకోవాలి. అయితే ఇప్పుడు పాశ్చాత్య సినిమాల ప్రభావం, హాలీవుడ్ కంటెంట్ వినియోగం పెరిగిపోవడం వల్ల దర్శకులు దానినే ఇండియాలో అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అలా ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రేక్షకులు ఇప్పటికే హాలీవుడ్‌ నుంచి ఆ కంటెంట్ చూస్తున్నారు కదా. వాళ్లు క్వాలిటీ, కథ చెప్పే విధానం, నటన పరంగా వాళ్లు బాగా చేస్తున్నారు..’ అని రిషబ్ అన్నారు.

ఈ వాదనకు కొంత బలోపేతం చేకూర్చుతూ 2022లో కొన్ని హిందీ సినిమాలు విజయవంతమయ్యాయి కూడా. గంగూబాయి కాఠియావాడీ, ది కశ్మీరీ ఫైల్స్, భూల్ భులయ్యా 2, బ్రహ్మాస్త్ర వంటి చిత్రాలు భారతీయ అంశాలతో ముడిపడి ఉన్నాయి. వెబ్ కంటెంట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తరువాత భారతీయ చిత్రాల్లో ఈ అంశం ఇంకా ప్రాధాన్యత సంతరించుకుందని రిషబ్ శెట్టి అన్నారు.

‘ఇప్పుడు ఓటీటీలో పాశ్చాత్య కంటెంట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అనేక భాషల్లో, అనేక ప్లాట్‌ఫామ్స్‌పైన ఈ కంటెంట్ లభిస్తోంది. కానీ అక్కడ మా గ్రామ కథ దొరకదు కదా. ఆ ప్రాంతీయ కథ ప్రపంచంలో మరెక్కడా దొరకదు కదా. ప్రేక్షకుల ముందుకు తేవాల్సింది అదే..’ అని దర్శకులకు ఆయన సలహా ఇచ్చారు.

సప్తమి గౌడ, కిశోర్, అచ్యుత్ కుమార్ తదితరులు నటించిన కాంతారా మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 325 కోట్ల కలెక్షన్లు సాధించింది. కన్నడ ఒరిజినల్ రిలీజైన తరువాత రెండు వారాలకు డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజైంది. అవి కూడా విజయవంతమయ్యాయి. హిందీ వెర్షన్ రూ. 53 కోట్ల కలెక్షన్లు సాధించింది. మంచి లాభాలు సాధించిన భారతీయ చిత్రంగా కాంతారా నిలిచిపోయింది.

IPL_Entry_Point

టాపిక్