Kantara OTT Release Date: కాంతారా ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే..-kantara ott release date postponed to the month end ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kantara Ott Release Date: కాంతారా ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే..

Kantara OTT Release Date: కాంతారా ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే..

HT Telugu Desk HT Telugu
Nov 08, 2022 10:36 PM IST

Kantara OTT Release Date: కాంతారా ఓటీటీలోకి వచ్చే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే బాక్సాఫీస్‌ దగ్గర దుమ్ము రేపుతున్న ఈ సినిమా ముందుగా అనుకున్నట్లు ఈ నెలలో మాత్రం ఓటీటీలో వచ్చే అవకాశం కనిపించడం లేదు.

కాంతారా ఓటీటీ రిలీజ్ డేట్ పై కొనసాగుతున్న సస్పెన్స్
కాంతారా ఓటీటీ రిలీజ్ డేట్ పై కొనసాగుతున్న సస్పెన్స్

Kantara OTT Release Date: కన్నడ సినిమా కాంతారా ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనకు తెలుసు కదా. ఓ చిన్న సినిమాగా, ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్‌ దగ్గర వందల కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మొదట కేవలం కన్నడలోనే రిలీజైనా.. తర్వాత అక్కడ వచ్చిన క్రేజ్‌తో తెలుగు, తమిళం, హిందీల్లోనూ రిలీజైంది.

అలాంటి సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అన్న ఆతృత అందరిలోనూ ఉంది. హోంబలె ఫిల్మ్స్‌ తెరకెక్కించిన ఈ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకుందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఈ డీల్‌ను మేకర్స్‌ రద్దు చేసుకున్నారట. ప్రైమ్‌ వీడియోతోనే మరో డీల్‌ కోసం చర్చలు మొదలుపెట్టారు.

నిజానికి నవంబర్‌ 18న ఓటీటీలో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావించారు. కానీ ఆ రోజు కాంతారా ఓటీటీలోకి వచ్చే అవకాశం లేదు. ఈ నెల చివర్లో రానున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. సినిమా ఇప్పటికీ బాక్సాఫీస్‌ దగ్గర బాగానే వసూళ్లు రాబడుతుండటంతో మరికొన్ని రోజులు ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

300 కోట్ల క్లబ్ లో కాంతారా

రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించిన కాంతారా సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా అద్భుత‌మైన క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది. ఆదివారం (నవంబర్ 5) నాటికే ఈ సినిమా 300 కోట్ల క్ల‌బ్‌ల్ ఎంట‌రైంది. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈసినిమా రిలీజై నాలుగు వారాలు దాటినా క‌లెక్ష‌న్స్ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. తెలుగులో ఈ సినిమా 60 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. నార్త్ ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా 62 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మూడో వారంలో పోలిస్తే నాలుగో వారంలో క‌లెక్ష‌న్స్ మ‌రింత‌గా పెరిగిన‌ట్లు స‌మాచారం. బాలీవుడ్‌లో రామ్‌సేతు, ఫోన్‌బూత్‌తో పాటు ప‌లు స్ట్రెయిట్ సినిమాలు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోవ‌డం కాంతారాకు క‌లిసివ‌చ్చాయి. క‌న్న‌డ భాష‌లో ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు 160 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. కాంతారా సినిమాకు త‌మిళంలో 10 కోట్లు, కేర‌ళ‌లో 15 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.

Whats_app_banner