kantara enters 300 crore club: 300 కోట్ల క్ల‌బ్‌లో కాంతారా - బాలీవుడ్‌లో 65 కోట్ల క‌లెక్ష‌న్స్‌-kantara movie enters 300 crore club worldwide rishab shetty film collets 65 crore in bollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kantara Enters 300 Crore Club: 300 కోట్ల క్ల‌బ్‌లో కాంతారా - బాలీవుడ్‌లో 65 కోట్ల క‌లెక్ష‌న్స్‌

kantara enters 300 crore club: 300 కోట్ల క్ల‌బ్‌లో కాంతారా - బాలీవుడ్‌లో 65 కోట్ల క‌లెక్ష‌న్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 07, 2022 06:02 PM IST

kantara enters 300 crore club: రిష‌బ్‌శెట్టి కాంతారా సినిమా మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న‌ది. మూడు వంద‌ల కోట్ల క‌లెక్ష‌న్స్‌ క్ల‌బ్‌లో ఈ సినిమా చేరింది.

రిష‌బ్ శెట్టి
రిష‌బ్ శెట్టి

kantara enters 300 crore club: రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించిన కాంతారా సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా అద్భుత‌మైన క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది. ఆదివారం నాటితో ఈ సినిమా 300 కోట్ల క్ల‌బ్‌ల్ ఎంట‌రైంది. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈసినిమా రిలీజై నాలుగు వారాలు దాటినా క‌లెక్ష‌న్స్ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు.

తెలుగులో ఈ సినిమా 60 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. నార్త్ ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా 62 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మూడో వారంలో పోలిస్తే నాలుగో వారంలో క‌లెక్ష‌న్స్ మ‌రింత‌గా పెరిగిన‌ట్లు స‌మాచారం. బాలీవుడ్‌లో రామ్‌సేతు, ఫోన్‌బూత్‌తో పాటు ప‌లు స్ట్రెయిట్ సినిమాలు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోవ‌డం కాంతారాకు క‌లిసివ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం. క‌న్న‌డ భాష‌లో ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు 160 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. కాంతారా సినిమాకు త‌మిళంలో 10 కోట్లు, కేర‌ళ‌లో 15 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

రిష‌బ్ శెట్టి హీరోగా న‌టిస్తూ కాంతారా సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌ర్ణాట‌క‌లోని భూత‌క‌ళ అనే ట్రెడిష‌న‌ల్ ఆర్ట్ ఫామ్‌కు రివేంజ్ డ్రామాను జోడించి ఈ సినిమా తెర‌కెక్కింది. త‌మ భూముల‌కు అక్ర‌మించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన రాజ‌వంశీయుల‌తో పాటు ఫారెస్ట్ అధికారుల‌పై శివ అనే యువ‌కుడు ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడ‌న్న‌ది ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ అంశాల‌తో రిష‌బ్ శెట్టి ఈ సినిమాలో చూపించారు.

శివ పాత్ర‌లో రిష‌బ్ శెట్టి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తోన్నాయి. బాలీవుడ్‌, టాలీవుడ్‌తో పాటు ప‌లు భాష‌ల‌కు చెందిన న‌టీన‌టులు కాంతారా సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.కన్నడంలో ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.

IPL_Entry_Point

టాపిక్