Urvasivo Rakshasivo OTT Release Date: రెండు ఓటీటీల‌లో రిలీజ్ కానున్న ఊర్వ‌శివో రాక్ష‌సివో-urvasivo rakshasivo digital rights acquired by netflix and aha ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Urvasivo Rakshasivo Ott Release Date: రెండు ఓటీటీల‌లో రిలీజ్ కానున్న ఊర్వ‌శివో రాక్ష‌సివో

Urvasivo Rakshasivo OTT Release Date: రెండు ఓటీటీల‌లో రిలీజ్ కానున్న ఊర్వ‌శివో రాక్ష‌సివో

Nelki Naresh Kumar HT Telugu
Nov 05, 2022 09:22 AM IST

Urvasivo Rakshasivo OTT Release Date: శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన అల్లు శిరీష్ ఊర్వ‌శివో రాక్ష‌సివో పాజిటివ్ మౌత్‌టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ సినిమా ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌లో రిలీజ్ కానుంది. ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఏవంటే..

ఊర్వ‌శివో రాక్ష‌సివో
ఊర్వ‌శివో రాక్ష‌సివో

Urvasivo Rakshasivo OTT Release Date: ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమాతో కెరీర్‌లో ఫ‌స్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ అందుకున్నాడు అల్లు శిరీష్. శుక్ర‌వారం రిలీజైన ఈ సినిమా పాజిటివ్ మౌత్‌టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు రాకేష్ శ‌శి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాగా ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద‌క్కించుకున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌తో పాటు ఆహా ఓటీటీలో ఈ సినిమా ఒకే సారిస్ట్రీమింగ్ కానుంది. డిసెంబ‌ర్ ఫ‌స్ట్‌వీక్‌లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. త‌మిళ చిత్రం ప్యార్ ప్రేమ కాద‌ల్ ఆధారంగా ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమా రూపొందింది. ఓ ట్రెడిష‌న‌ల్ అబ్బాయి, మోడ్ర‌న్ అమ్మాయి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌ను ఎంట‌ర్‌టైనింగ్‌గా ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ఆవిష్క‌రించారు.

లివింగ్‌రిలేష‌న్స్‌, పెళ్లి ప‌ట్ల యువ‌త ఆలోచ‌న‌లు ఎలా ఉంటున్నాయో ఈ సినిమాలో చూపించారు. ఇందులో శ్రీకుమార్ అనే యువ‌కుడిగా అల్లు శిరీష్ మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా న‌టించింది. వెన్నెల‌కిషోర్‌, సునీల్ త‌మ కామెడీ టైమింగ్‌తో సినిమాను గ‌ట్టెక్కించారు.

జీఏ2 పిక్చ‌ర్స్ ప‌తాకంపై త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, ధీర‌జ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మించారు. తొలుత త‌మిళ సినిమాను త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ తెలుగులో డ‌బ్ చేయాల‌ని అనుకున్నారు. డ‌బ్బింగ్ సినిమాకు సంబంధించిన‌ ట్రైల‌ర్‌ను చిరంజీవి చేతుల మీదుగా విడుద‌ల‌చేశారు. కానీ శిరీష్ ఈ సినిమాను రీమేక్ చేయ‌డానికి ఆస‌క్తిని చూప‌డంతో డ‌బ్బింగ్ సినిమాను ఆపివేసి ఊర్వ‌శివో రాక్ష‌సివో పేరుతో రీమేక్ చేశారు.

IPL_Entry_Point