తెలుగు న్యూస్  /  Entertainment  /  Rajamouli On Mahabharata Says He Wants To Bring It In 10 Parts

Rajamouli on Mahabharata: మహాభారతాన్ని పది భాగాలుగా తీస్తా: రాజమౌళి

Hari Prasad S HT Telugu

09 May 2023, 20:11 IST

    • Rajamouli on Mahabharata: మహాభారతాన్ని పది భాగాలుగా తీస్తానని రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. చాలా రోజులుగా ఈ ఇతిహాసాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించాలని అతడు తహతహలాడుతున్న విషయం తెలిసిందే.
ఎస్ఎస్ రాజమౌళి
ఎస్ఎస్ రాజమౌళి (AFP)

ఎస్ఎస్ రాజమౌళి

Rajamouli on Mahabharata: మహాభారతం.. ఒకప్పుడు సీరియల్ రూపంలో దూరదర్శన్‌లో కొన్నేళ్లపాటు ప్రేక్షకులను అలరించింది. ఈ ఇతిహాసాన్ని సినిమా రూపంలో తీసుకురావాలని దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఎప్పటి నుంచో భావిస్తున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేకపోయింది. కానీ ఇప్పటికీ మహాభారతాన్ని తెరకెక్కించాలన్న ఆసక్తిని జక్కన్న వ్యక్తపరుస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Top IMDb adventure movies on ott: ఓటీటీల్లోని టాప్ ఐఎండీబీ రేటింగ్ అడ్వెంచర్ మూవీస్ ఇవే..

Asura Guru Telugu OTT: తెలుగులో నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోన్న కోలీవుడ్ యాక్ష‌న్ మూవీ అసుర గురు

Guppedantha Manasu Today Episode: వ‌సుధార‌పై మ‌న‌సు ప‌డ్డ మ‌ను - శైలేంద్రకు మ‌హేంద్ర ప‌నిష్‌మెంట్ - రాజీవ్ చ‌నిపోలేదా?

Krishna mukunda murari april 30th: మురారి బిడ్డ ముకుంద కడుపులో.. కృష్ణ నెల తప్పిందని భవానీ ఆనందం, ఆదర్శ్ జలస్

తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి దీనిపై స్పందించాడు. అయితే తొలిసారి ఈ ఇతిహాసాన్ని పది భాగాలుగా తీసుకురావాలని భావిస్తున్నట్లు అతడు చెప్పడం విశేషం. మహాభారతం చాలా పెద్దది, ఎంతో సంక్లిష్టమైన స్టోరీ అని.. అందుకే దీనిని పది భాగాలుగా తీయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ భారీ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తున్నా.. దానిపై రాజమౌళి ఆసక్తి మాత్రం తగ్గలేదు.

ప్రతి సినిమానూ అతడు ఎలా తీర్చిదిద్దుతాడో మనకు తెలిసిందే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలనే ఎన్నో ఏళ్లపాటు తీశాడు. అలాంటి మహాభారతంలాంటి ఇతిహాసాన్ని జక్కన్న సినిమాగా తీస్తే చూడాలని కోరుకోని అభిమాని ఉండడు. అతని స్టోరీ చెప్పే విధానం, సిల్వర్ స్క్రీన్ పై విజువల్స్ లో ఉండే రిచ్‌నెస్ లో మహాభారతం కూడా కనిపిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది?

ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పని నడుస్తోంది. మరోవైపు మహాభారతం ఒకప్పుడు దూరదర్శన్ లో ఏకంగా 260 ఎపిసోడ్ల పాటు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఎప్పుడూ మూడున్నర దశాబ్దాల కిందటే ఈ ఇతిహాసం ఓ సీరియల్ రూపంలో వచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.