Mahabharat series: మహాభారతం ఆధారంగా వెబ్ సిరీస్ - ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే-disney plus hotstar announces mahabharat web series here the streaming date and other details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Disney Plus Hotstar Announces Mahabharat Web Series Here The Streaming Date And Other Details

Mahabharat series: మహాభారతం ఆధారంగా వెబ్ సిరీస్ - ఏ ఓటీటీలో రిలీజ్ కానుందంటే

HT Telugu Desk HT Telugu
Sep 10, 2022 06:36 PM IST

Mahabharat series: భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం ఆధారంగా ఓ వెబ్ సిరీస్ రూపొందుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కానున్న ఈ వెబ్ సిరీస్ కు దర్శకనిర్మాతలు ఎవరంటే...

మహాభారత్
మహాభారత్ (Twitter)

Mahabharat series: బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో పురాణాలు, చరిత్రను వెండితెరపై ఆవిష్కరించే ట్రెండ్ పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా రామాయణం ఆధారంగా రూపొందుతోంది. అలాగే సమంత టైటిల్ పాత్రలో నటిస్తున్న శాకుంతల పౌరాణిక కథాంశంతోనే తెరకెక్కుతోంది. తాజాగా పురాతన ఇతిహాసం మహాభారతం త్వరలో సిరీస్ రూపంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

లైవ్ యాక్షన్ విధానంలో అత్యున్నత సాంకేతిక పరిజనంతో రూపొందుతున్న ఈ సిరీస్ కు అల్లు అరవింద్, మధు మంతెన నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ లో మహాభారత్ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతున్నది. ఈ విషయాన్ని హాట్ స్టార్ శనివారం ప్రకటించింది.తెలుగుతో పాటు అన్ని లాంగ్వేజెస్ లో మహాభారత్ సిరీస్ అందుబాటులో ఉండబోతున్నట్లు ప్రకటించింది.

‘ఇప్పటివరకు వ్రాయబడిన గొప్ప ఇతిహాసం. మునుపెన్నడూ చూడని స్థాయిలో తిరిగి చెప్పబడింది. ఒక అద్భుతమైన దృశ్య కావ్యం కోసం చూస్తు ఉండండి’ అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. అల్లు ఎంటర్ టైనర్ మెంట్స్ పేరుతో అల్లు అరవింద్ ఫ్యామిలీ ఇటీవలే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ పై రూపొందుతున్న తొలి ప్రాజెక్ట్ ఇదే.

ఇందులో బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు పలు భాషలకు చెందిన నటీనటుల్ని లైవ్ యాక్షన్ విధానంలో చూపించబోతున్నారు. దర్శకుడితో పాటు నటీనటుల వివరాల్ని త్వరలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

IPL_Entry_Point