తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli On Dasara: నాని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్.. దసరా మూవీపై రాజమౌళి రివ్యూ

Rajamouli on Dasara: నాని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్.. దసరా మూవీపై రాజమౌళి రివ్యూ

Hari Prasad S HT Telugu

03 April 2023, 16:20 IST

    • Rajamouli on Dasara: నాని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ దసరా మూవీపై రాజమౌళి తన రివ్యూ ఇచ్చాడు. ఈ దర్శక ధీరుడు ట్విటర్ ద్వారా ఈ టాలీవుడ్ మెగా హిట్ పై స్పందించాడు.
దసరాలో నాని
దసరాలో నాని

దసరాలో నాని

Rajamouli on Dasara: టాలీవుడ్ లో ప్రస్తుతం సంచలనాలు క్రియేట్ చేస్తున్న మూవీ దసరా. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే నాని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధమవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

Murder in Mahim OTT Release Date: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మర్డర్ ఇన్ మహిమ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nikhil Swayambhu: ఒక్క ఫైట్ కోసం రూ.8 కోట్లు.. నిఖిల్ స్వయంభు మూవీ షూటింగ్ మరో లెవల్లో..

అలాంటి సినిమాపై దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సోమవారం (ఏప్రిల్ 3) మధ్యాహ్నం అతడు తన ట్విటర్ అకౌంట్ లో దసరా మూవీ రివ్యూ షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా అద్భుతని, నాని కెరీర్ లోనే అత్యుత్తమమైన పర్ఫార్మెన్స్ అని రాజమౌళి అనడం విశేషం.

"సహజసిద్ధంగా కనిపించిన లొకేషన్, క్యారెక్టర్లతో శ్రీకాంత్ ఓదెల ఓ మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ తీశాడు. నాని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. కీర్తి చాలా సులువుగా తన పాత్ర పోషించింది. ప్రతి ఒక్కరి నటన అద్భుతం. సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్. బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కూడా బాగుంది. ఈ అద్భుతమైన సక్సెస్ అందుకున్న దసరా టీమ్ కు శుభాకాంక్షలు" అని రాజమౌళి ట్వీట్ చేశాడు.

మార్చి 30న రిలీజ్ అయిన దసరా మూవీ ఊహించినట్లే భారీ కలెక్షన్లు రాబట్టింది. తొలి నాలుగు రోజుల్లోనే రూ.87 కోట్లకుపైగా కలెక్షన్లతో నాని కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు రూ.100 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకెళ్తోంది. తెలంగాణలోని సింగరేణి గనుల బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా.. నాని, కీర్తి సురేశ్ తో పాటు దీక్షిత్ శెట్టి, సాయి కుమార్, షైన్ టామ్ చాకో, సముద్రఖని, పూర్ణ, జరీనా వహాబ్ నటించారు. సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేశాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.