తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani On Dasara: దసరాలాంటి సినిమా మళ్లీ చేయను.. నాని షాకింగ్ కామెంట్స్

Nani on Dasara: దసరాలాంటి సినిమా మళ్లీ చేయను.. నాని షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

03 April 2023, 15:10 IST

    • Nani on Dasara: దసరాలాంటి సినిమా మళ్లీ చేయను అంటూ నాని షాకింగ్ కామెంట్స్ చేశాడు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షంతో దుమ్ము రేపుతున్న ఈ సినిమా గురించి నాని ఎందుకు అలాంటి కామెంట్స్ చేశాడో మీరూ చూడండి.
దసరా ప్రమోషన్ల సందర్భంగా నాని
దసరా ప్రమోషన్ల సందర్భంగా నాని (Naeem Ansari)

దసరా ప్రమోషన్ల సందర్భంగా నాని

Nani on Dasara: నేచరల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. నాని కెరీర్ లోనే కాదు.. ఈ ఏడాది టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాలు అన్నింటికంటే ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచే దిశగా వెళ్తోంది. నాలుగు రోజుల్లోనే రూ.87 కోట్లకుపైగా వసూలు చేసి.. నాని కెరీర్ లో తొలి వంద కోట్ల సినిమాగా నిలవడానికి సిద్ధమవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

రూ.40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఇప్పటికే లాభాలు తెచ్చిపెడుతోంది. అయితే అలాంటి దసరా మూవీపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రానున్న కొన్నేళ్లలో తాను మళ్లీ దసరాలాంటి కమర్షియల్ సినిమా చేయబోనని అన్నాడు. తన సినిమాలు రిపీట్ కాకుండా చూసుకుంటానని, అందుకే మరో కమర్షియల్ మూవీ చేయడానికి టైమ్ పడుతుందని నాని చెప్పడం విశేషం.

సోమవారం (ఏప్రిల్ 3) అతడు మీడియాతో మాట్లాడాడు. దసరా సినిమాకు వస్తున్న రెస్పాన్స్, తన భవిష్యత్తు ప్రాజెక్టులపై నాని స్పందించాడు. దసరా మూవీ ఇంత పెద్ద హిట్ అవుతుందని తాను ముందు నుంచీ అనుకుంటూనే ఉన్నట్లు నాని చెప్పాడు. మరి మరో కమర్షియల్ సినిమా చేస్తారా అని ప్రశ్నించగా.. దానికి నాని ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు.

"నేనేదీ ప్లాన్ చేయను. జరగాల్సినవి వాటికవే జరుగుతాయని నేను నమ్ముతాను. నేను కేవలం చేసిన సినిమా మళ్లీ చేయొద్దని అనుకుంటాను. దసరాలాంటి మాస్ సినిమాను నేను వచ్చే కొన్నేళ్లలో మాత్రం కచ్చితంగా చేయను" అని నాని స్పష్టం చేశాడు. ఈ సినిమాలో ధరణి అనే ఊర మాస్ క్యారెక్టర్ లో నాని కనిపించాడు.

ఇక దసరా మూవీకి నార్త్ లో ఆశించిన మేర వసూళ్లు రాకపోవడంపై కూడా నాని స్పందించాడు. "అభిమానులు థియేటర్లకు క్యూ కట్టడానికి నేనేమీ అమితాబ్ బచ్చన్ ని కాదు. కలెక్షన్ల గురించి నాకు తెలుసు. కానీ మేము టార్గెట్ చేసిన ఏరియాల్లో మాత్రం సినిమా మాత్రం బాగా ఆడుతోంది. అది నాకు చాలా సంతోషం" అని నాని అన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం