Nani Dasara Success Celebration: 'జెర్సీ' అర్జున్‌గా మారిన 'దసరా' ధరణి.. విజయాన్ని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్న నాని-nani celebrates dasara movie success with jersey s arjun photo ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani Dasara Success Celebration: 'జెర్సీ' అర్జున్‌గా మారిన 'దసరా' ధరణి.. విజయాన్ని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్న నాని

Nani Dasara Success Celebration: 'జెర్సీ' అర్జున్‌గా మారిన 'దసరా' ధరణి.. విజయాన్ని వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్న నాని

Maragani Govardhan HT Telugu
Mar 31, 2023 07:27 PM IST

Nani Dasara Success Celebration: దసరా సినిమా విడుదలైనప్పటి నుంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో నాని సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో జెర్సీ సినిమాలోని అర్జున్ ఫొటోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు నాని.

జెర్సీ అర్జున్‌గా మారిన దసరా ధరణి
జెర్సీ అర్జున్‌గా మారిన దసరా ధరణి

Nani Dasara Success Celebration: నేచురల్ స్టార్ నాని నటించిన దసరా చిత్రం గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమాకు సర్వత్రా పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకుంటోంది. తను ఎంతో కష్టపడి చేసిన దసరా హిట్ కావడంతో నాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైతున్నారు. తన సంతోషాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు.

నాని కెరీర్‌లో అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా నిలిచిన జెర్సీ చిత్రంలోని ట్రైన్ సన్నివేశం గుర్తుండే ఉంటుంది. రైలు వెళ్తుండగా ఆ సినిమాలో అర్జున్ తన ఆనందాన్ని కేకలు పెడుతూ పంచుకుంటారు. మనస్సులో ఉన్న ఎమోషన్‌ను అరుస్తూ తీర్చుకుంటాడు. అదీ కూడా ట్రైన్ వెళ్తున్నంత సేపు అలాగే ఆనందపడుతుంటాడు. ఈ సీన్‌కు ఆడియెన్స్ నుంచి విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అదే పోస్టర్‌ను నెట్టింట షేర్ చేస్తూ నాని తన సంతోషాన్ని పంచుకున్నారు.

అయితే ఇక్కడ రెండు చేతులతో గొడ్డళ్లను పట్టుకున్నట్లు ఫోజివ్వడం ఇది దసరా సినిమాకు చెందిందిగా తెలుస్తుంది. అంటే దసరా సక్సెస్‌ను నాని.. జెర్సీలోని అర్జున్ పాత్ర ద్వారా ఎక్స్‌ప్రెస్ చేశారు. ఈ ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ పోస్టర్‌పై విశేషంగా స్పందిస్తున్నారు. నాని సూపర్ హిట్ కొట్టాడంటూ తమ అభిప్రాయాన్ని తెలిజేస్తున్నారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదలైంది. ఈ చిత్రం 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

IPL_Entry_Point