Most Influential People of 2023 : అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో రాజమౌళి!-only 2 indians among time most influential people of 2023 see full details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Only 2 Indians Among Time Most Influential People Of 2023 See Full Details

Most Influential People of 2023 : అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో రాజమౌళి!

Sharath Chitturi HT Telugu
Apr 14, 2023 08:40 AM IST

TIME Most Influential People of 2023 : అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను టైమ్​ వెల్లడించింది. రాజమౌళి, షారుక్​ ఖాన్​లకు చోటు దక్కింది.

అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయులు ఇద్దరే!
అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయులు ఇద్దరే!

TIME Most Influential People of 2023 : 2023 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను టైమ్​ విడుదల చేసింది. ఇందులో కేవలం ఇద్దరు భారతీయులకే చోట్టు దక్కింది. వీరిలో ఒకరు భారత దేశ సినీ రంగం సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన దిగ్గజ దర్శకుడు ఎస్​.ఎస్​ రాజమౌళి. మరొకరు బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​!

ట్రెండింగ్ వార్తలు

‘రాజమౌళికి అన్ని తెలుసు..’

రాజమౌళి రూపొందించిన ఆర్​ఆర్​ఆర్​లోని నాటునాటు పాటకు ఆస్కార్​ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో "టైమ్​ 100 : ది మోస్ట్​ ఇన్​ఫ్ల్యుయెన్షియల్​ పీపుల్​ ఆఫ్​ 2023"లో ఆయనకు చోటు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.

SS Rajamouli Most Influential People of 2023 : "ఆర్​ఆర్​ఆర్​లో రాజమౌళితో పనిచేస్తుంటే నా స్కూల్​ డేస్​ గుర్తుకొచ్చాయి. ఆడియెన్స్​కు ఏం కావాలో రాజమౌళికి తెలుసు. కథను ఎలా తీయాలి, ఎక్కడ ఎం పెట్టాలి అన్న విషయాల్లో ఆయనకు పట్టు ఉంది," అని టైమ్​కు రాశారు ప్రముఖ నటి ఆలియా భాట్​.

రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు ఆలియా భట్​. ఆయనొక మాస్టర్​ స్టోరీటెల్లర్​ని పేర్కొన్నారు. దేశ భౌగోళిక, సంప్రదాయాలు, ఆచారాలు, రుచుల్లో చాలా భేదాలు ఉన్నా.. ప్రజలందరిని ఆయన తన సినిమాలతో ఒక్కటి చేస్తారని స్పష్టం చేశారు.

బాలీవుడ్​ బాద్​షా కూడా..

Shah Rukh Khan Most Influential People of 2023 :  పఠాన్​తో ఇటీవలే బ్లాక్​బస్టర్​ హిట్​ కొట్టిన షారుక్​ ఖాన్​ కూడా 2023 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. 2023 టాప్​ ఐకాన్స్​లో ఆయనకు స్థానం దక్కింది. ఈ లిస్ట్​లో పెడ్రో పాస్కల్​, కింగ్​ ఛార్లస్​, సల్మాన్​ రుష్ది, కీ హు క్వాన్​ వంటి ప్రముఖులు ఉన్నారు.

"షారుక్​ ఖాన్​ను తొలిసారిగా కలిసిన రోజు నాకు ఇంకా గుర్తుంది. అప్పుడే నేను ముంబైలో కొత్తగా దిగాను. కలల ప్రపంచంలో అడుగుపెట్టాను. ఆరు నెలల్లో షారుక్​ ఖాన్​ పక్కన నటించే అవకాశం దక్కింది. 16ఏళ్లు గడిచిపోయాయి. మా మధ్య ప్రేమ, నమ్మకం, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం పెరుగుతూనే ఉంది," అని ప్రముఖ నటి దీపిక పదుకొణె టైమ్​కు రాసుకొచ్చారు.

Shah Rukh Khan latest news : టైమ్​ 100 : ది మోస్ట్​ ఇన్​ఫ్లుయెన్షియల్​ పీపుల్​ ఆఫ్​ 2022లో బిలియనీర్​ గౌతమ్​ అదానీ, సుప్రీంకోర్టు న్యాయవాది కరుణ నుంది, కశ్మీరీ కార్యకర్త ఖుర్రమ్​ పర్వీజ్​లకు చోటు దక్కింది. ఈసారి మాత్రం ఇద్దరే ఆ జాబితాలోకి ఎక్కారు.

WhatsApp channel

సంబంధిత కథనం