తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli About Kantara Success: కాంతారా సక్సెస్‌పై రాజమౌళి ఏమన్నాడో తెలుసా?

Rajamouli about Kantara Success: కాంతారా సక్సెస్‌పై రాజమౌళి ఏమన్నాడో తెలుసా?

HT Telugu Desk HT Telugu

12 December 2022, 14:53 IST

    • Rajamouli about Kantara Success: కాంతారా సక్సెస్‌పై రాజమౌళి ఎలా రియాక్టవుతాడు అన్న ఆసక్తి చాన్నాళ్లుగా ఫ్యాన్స్‌లో నెలకొంది. ఓ చిన్న సినిమా అంత పెద్ద సక్సెస్‌ సాధించడంపై ఈ పాన్‌ ఇండియా డైరెక్టర్‌ మొత్తానికి స్పందించాడు.
ఎస్ఎస్ రాజమౌళి
ఎస్ఎస్ రాజమౌళి

ఎస్ఎస్ రాజమౌళి

Rajamouli about Kantara Success: కాంతారా.. 2022లో ఎన్నో పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. కొన్ని బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాశాయి. కానీ ఎలాంటి అంచనాలు, ప్రమోషన్లు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా ఈ కాంతారా. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకుపైగా వసూలు చేసిందంటేనే ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

NNS May 9th Episode: భాగీకి దగ్గరవుతున్న పిల్లలు.. యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న అమర్.. ఆరు కోరికకు మాయమైన యముడు

Kalvan OTT: ఓటీటీలోకి ల‌వ్ టుడే హీరోయిన్ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ - తెలుగులోనూ స్ట్రీమింగ్‌

Devara Release: దేవర సినిమా రిలీజ్ డేట్ మళ్లీ మారనుందా?

Geethanjali Malli Vachindi OTT: ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా

బాక్సాఫీస్‌ రికార్డులు అనగానే మనకు గుర్తొచ్చే పేరు ఎస్‌ఎస్‌ రాజమౌళి. ఇప్పటి వరకూ పరాజయం అంటే ఏంటో తెలియని డైరెక్టర్‌గా, 2022లోనే రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీని అందించిన రాజమౌళి.. ఇప్పుడు కాంతారా సక్సెస్‌పై స్పందించాడు. ముఖ్యంగా భారీ బడ్జెట్‌, అంతకంటే భారీ ప్రమోషన్లతో తన సినిమా రేంజ్‌ను పెంచుకునే ఈ డైరెక్టర్‌.. ఓ చిన్న సినిమా ఇంత పెద్ద విజయంపై ఎలా స్పందిస్తాడో అన్న ఆసక్తి చాలా రోజులుగా ఉంది.

మొత్తానికి డైరెక్టర్స్‌ రౌండ్‌ టేబుల్‌ 2022లో భాగంగా ఫిల్మ్‌ క్రిటిక్ అనుపమ చోప్రాతో మాట్లాడుతూ.. కాంతారా సక్సెస్‌ స్పందించాడు. బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్‌ కావాలంటే భారీ బడ్జెట్ అవసరం లేదని నిరూపించిన సినిమా కాంతారా అని రాజమౌళి అనడం గమనార్హం.

"భారీ స్థాయిలో వసూళ్ల కోసం భారీ సినిమా అవసరం లేదు. కాంతారా ఇదే నిరూపించింది. ఓ చిన్న సినిమా కూడా ఇది సాధించగలదని చాటి చెప్పింది. ఓ ప్రేక్షకుడిగా ఇది ఉత్సాహం నింపేదే. కానీ ఓ ఫిల్మ్‌ మేకర్‌గా ఒత్తిడి పెంచేదే. మేమేం చేస్తున్నాం.. ఇతరులు ఏం చేస్తున్నారు అని చూడాల్సిన అవసరం ఉంది" అని రాజమౌళి అన్నాడు.

ఈ ఇంటర్వ్యూ ఫుల్‌ వీడియో ఇంకా బయటకు రాకపోయినా.. కాంతారా గురించి రాజమౌళి స్పందించిన క్లిప్‌ మాత్రం ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా భారీతనానికి కేరాఫ్‌ రాజమౌళి. బాహుబలి అయినా, ఆర్‌ఆర్‌ఆర్‌ అయినా, ఇప్పుడు మహేష్‌ బాబుతో తీయబోయే సినిమా అయినా రాజమౌళి అంటేనే భారీ బడ్జెట్‌, పెద్ద ఎత్తు విజువల్‌ ఎఫెక్ట్స్‌ సర్వ సాధారణం. అలాంటి వ్యక్తి ఓ చిన్న బడ్జెట్‌తో పెద్ద సంచలనం సృష్టించిన కాంతారాలాంటి మూవీల గురించి ఎలా ఆలోచిస్తాడన్న ఆసక్తి ప్రేక్షకుల్లో సహజం.

ఇలాంటి సినిమాలు తనలాంటి దర్శకులపై ఒత్తిడి పెంచుతాయని రాజమౌళి అనడం నిజంగా విశేషమే. ఆర్‌ఆర్ఆర్‌ మూవీ సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి అంతకు మూడింతలు ఎక్కువ రాబట్టింది. కానీ కాంతారా మాత్రం కేవలం రూ.15 కోట్లతో తెరకెక్కి.. అంతకు ఎన్నో రెట్లు ఎక్కువగా అంటే రూ.400 కోట్లకుపైనే వసూలు చేసింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.