Rashmika Mandanna Kantara Movie: కాంతార వివాదంపై స్పందించిన రష్మిక - కన్నడంలో బ్యాన్‌పై ఏమన్నదంటే
Rashmika Mandanna Kantara Movie: రష్మిక మందన్నను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రచారంపై రష్మిక మందన్న స్పందించింది. ఆమె ఎమన్నదంటే...
Rashmika Mandanna Kantara Movie: గత కొంతకాలంగా రష్మిక మందన్నపై కన్నడ సినీ అభిమానులు ఫైర్ అవుతోన్న సంగతి తెలిసింది. రష్మిక మందన్నను బ్యాన్ చేయాలంటూ విమర్శలు కురిపిస్తున్నారు. కన్నడ బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ కాంతార చూడలేదంటూ రష్మిక స్టేట్‌మెంట్ ఈవ్వడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాణ సంస్థ పేరును బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించడానికి రష్మిక ఇష్టపడకపోవడంతో ఈ గొడవ పెద్దదైంది.
రష్మికను కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ వివాదంపై ఇన్నాళ్లు సెలైంట్‌గా ఉన్న రష్మిక మందన్న తాజాగా స్పందించింది. కాంతార సినిమాను తాను చూశానని చెప్పింది. కాంతార సినిమా రిలీజైన రెండో రోజు సినిమా చూశారా అని కొందరు నన్ను అడిగారు. అప్పుడు చూడలేదు.
ఆ తర్వాత వీలు కుదుర్చుకొని కాంతార చూశా. సినిమా బాగుందని టీమ్‌కు మెసేజ్ పెట్టా. థాంక్యూ అని వారి నుంచి రిప్లై వచ్చింది. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో, నటీనటుల మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ ఉందనేది ఎవరికి తెలియదు. నా పర్సనల్‌లైఫ్‌లో ఎలా ఉంటున్నానో, ఏం చేస్తున్నానో ఎవరికి చెప్పాల్సిన పని లేదు. పర్సలైఫ్‌లో జరిగే ప్రతి విషయాన్ని కెమెరా పెట్టి చూపించలేను. వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టి ప్రొఫెషనల్ లైఫ్‌లో ఏం చెప్తున్నాను, ఏం చేస్తున్నానన్నదానిపై ఫోకస్ పెడితే బాగుంటుంది అని తెలిపింది.
కన్నడ ఇండస్ట్రీ తనపై బ్యాన్ విధించనున్నట్లు వస్తోన్న వార్తలపై రష్మిక రియాక్ట్ అయ్యింది. ఇప్పటివరకు కన్నడ ఇండస్ట్రీ తనపై ఎలాంటి బ్యాన్ విధించలేదంటూ, బ్యాన్ గురించి తనతో ఎవరూ మాట్లాడలేదని బదులిచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న యానిమల్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో అల్లు అర్జున్‌తో పుష్ప 2 సినిమా చేస్తోంది.