తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rahasyam Idam Jagath: రాముడు, హనుమంతుడికేనా.. మనకిలా జరగదా? కల్కి, హనుమాన్, కార్తికేయలా సైన్స్ ఫిక్షన్ మైథాలాజికల్ మూవీ

Rahasyam Idam Jagath: రాముడు, హనుమంతుడికేనా.. మనకిలా జరగదా? కల్కి, హనుమాన్, కార్తికేయలా సైన్స్ ఫిక్షన్ మైథాలాజికల్ మూవీ

Sanjiv Kumar HT Telugu

30 October 2024, 9:08 IST

google News
  • Rahasyam Idam Jagath Trailer Release By Chandoo Mondeti: తెలుగులో సైన్స్ ఫిక్షన్ మైథాలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మూవీ రహస్యం ఇదం జగత్. అక్టోబర్ 29న రహస్యం ఇదం జగత్ ట్రైలర్‌ను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో మూవీ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

రాముడు, హనుమంతుడికేనా.. మనకిలా జరగదా? కల్కి, హనుమాన్, కార్తికేయలా సైన్స్ ఫిక్షన్ మైథాలాజికల్ మూవీ
రాముడు, హనుమంతుడికేనా.. మనకిలా జరగదా? కల్కి, హనుమాన్, కార్తికేయలా సైన్స్ ఫిక్షన్ మైథాలాజికల్ మూవీ

రాముడు, హనుమంతుడికేనా.. మనకిలా జరగదా? కల్కి, హనుమాన్, కార్తికేయలా సైన్స్ ఫిక్షన్ మైథాలాజికల్ మూవీ

Science Fiction Mythological Thriller Movie Telugu: పోస్టర్స్‌, గ్లింప్స్‌, టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన రహస్యం ఇదం జగత్ సినిమాలో సైన్స్‌ ఫిక్షన్‌తో పాటు పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వఉన్నాయని తెలుస్తోంది.

కోమల్ ఆర్ భరద్వాజ్ డైరెక్షన్

రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా నటించిన సినిమా రహస్యం ఇదం జగత్. ఈ సినిమాను సింగిల్‌ సెల్‌ యూనివర్స్ ప్రొడక్షన్‌ పతాకంపై పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు. రహస్యం ఇదం జగత్ చిత్రానికి కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన రహస్యం ఇదం జగత్ టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. తాజాగా అక్టోబర్ 29న రహస్యం ఇదం జగత్ మూవీ ట్రైలర్‌ను కార్తికేయ-2 చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు. రహస్యం ఇదం జగత్ ట్రైలర్‌లో మన పురాణాలు, ఇతిహాసాల గురించి, శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించారు.

రహస్యం ఇదం జగత్ రిలీజ్

ట్రైలర్‌లో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్, పురాణల గురించి చెప్పిన విధానం బాగుంది. "హో.. ఇది రాముడి కథనా.. రాముడు, హనుమంతుడికేనా.. మనకిలా జరగదా" అని ఓ పాప చెప్పే డైలాగ్ హైలెట్‌గా ఉంది. అలాగే, సినిమాను పురాణాలకు లింక్ చేసి టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో చిత్రీకరించినట్లుగా ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. కాగా రహస్యం ఇదం జగత్ మూవీ నవంబర్ 8న థియేటర్లలో విడుదల కానుంది.

ఇక రహస్యం ఇదం జగత్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ.. ''బిగ్‌ థ్యాంక్స్‌ టు చందు మొండేటి.. ఇలాంటి సమయంలో కంటెంట్‌ చూసి.. కొత్తవాళ్లను ఎంకరైజ్‌ చేయడం గొప్ప విషయం దీనికి మంచి హృదయ కావాలి. నాకు కార్తికేయ ఇన్‌స్పిరేషన్‌. ఇండియన్‌ హిస్టరిని ఆ సినిమా ద్వారా అందరికి చాటి చెప్పాడు చందు గారు. ఆయన ప్రేరణతో ఈ సినిమా రూపొందించాను'' అని అన్నారు.

చిన్న పిల్ల ప్రశ్నకు

''ఈ సినిమా కేవలం మైథాలజీ కాదు.. రాముడు, హనుమంతుడేకేనా మనకు కూడా జరుగుతుందా అని వేసే ఓ చిన్న పిల్ల ప్రశ్నకు సమాధానంగా ఉంటుంది. అందరికి గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇది. సైన్స్‌ ఫిక్షన్‌కు మైథాలాజికల్‌ అంశాలు జోడించి నేటి తరం ప్రేక్షకులను మెప్పు పొందే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం'' అని డైరెక్టర్ కోమల్ ఆర్ భరద్వాజ్ తెలిపారు.

''తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్‌ ఉండే విజువల్స్‌ కూడా ఈ చిత్రంలో ఉంటాయి. కల్కి, హనుమాన్‌, కార్తికేయలా ఇది మైథలాజికల్‌ సినిమా'' అని రహస్యం ఇదం జగత్ డైరెక్టర్ కోమల్ ఆర్ భరద్వాజ్ చెప్పారు.

పురాణాల గురించి

''తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం ద్వారా మన పురాణాల గురించి, మన మూలాల గురించి ఓ కొత్త విషయాన్ని చెప్పబోతున్నాం. తప్పకుండా ఈ చిత్రం అందరిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేస్తుందనే నమ్మకం ఉంది'' అని డైరెక్టర్ కోమల్ ఆర్ భరద్వాజ్ చెప్పుకొచ్చారు.

తదుపరి వ్యాసం