OTT Sci Fi Thriller: ఓటీటీలోకి విజయ్ సైన్స్ ఫిక్షన్ థ్లిల్లర్- ఆ సీన్స్ కూడా యాడ్ చేసి- ఆరోజే స్ట్రీమింగ్- ఎక్కడంటే?-goat likely to ott streaming on netflix with extended cut vijay the greatest of all time ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Sci Fi Thriller: ఓటీటీలోకి విజయ్ సైన్స్ ఫిక్షన్ థ్లిల్లర్- ఆ సీన్స్ కూడా యాడ్ చేసి- ఆరోజే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

OTT Sci Fi Thriller: ఓటీటీలోకి విజయ్ సైన్స్ ఫిక్షన్ థ్లిల్లర్- ఆ సీన్స్ కూడా యాడ్ చేసి- ఆరోజే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Sep 05, 2024 02:32 PM IST

The Greatest Of All Time OTT Streaming: ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గోట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. అంతేకాకుండా గోట్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరిన్ని యాక్షన్ సీన్స్ యాడ్ చేసి పూర్తి నిడివితో గోట్ ఓటీటీ రిలీజ్ చేయనున్నారట.

ఓటీటీలోకి విజయ్ సైన్స్ ఫిక్షన్ థ్లిల్లర్ గోట్- ఆ సీన్స్ కూడా యాడ్ చేసి- ఆరోజే స్ట్రీమింగ్- ఎక్కడంటే?
ఓటీటీలోకి విజయ్ సైన్స్ ఫిక్షన్ థ్లిల్లర్ గోట్- ఆ సీన్స్ కూడా యాడ్ చేసి- ఆరోజే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

Goat OTT Release: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇవాళ (సెప్టెంబర్ 5) థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదలైంది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

విజయ్ కెరీర్‌లో ఇదే చివరి సినిమా అని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత విజయ్ పూర్తి స్థాయిలో తమిళనాడు రాజకీయాల్లో పాల్గొననున్నారు. తమిళనాడు 2026 ఎలక్షన్స్‌లో పోటీ కూడా చేయనున్నారు. దీంతో గోట్ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు విజయ్ అభిమానులు.

గోట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్

ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైన గోట్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. సైన్స్ ఫిక్షన్ అండ్ టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ నటన అదిరిపోగా.. రొటీన్ ప్లాట్ అని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు ఎక్స్ యూజర్స్. ఈ నేపథ్యంలో గోట్ ఓటీటీ రిలీజ్ డేట్, ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గోట్ మూవీ ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందని సమాచారం. అలాగే థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీ గోట్‌ను రిలీజ్ చేయనున్నారట. అంతేకాకుండా గోట్ సినిమాను మహాత్మ గాంధీ జయంతి రోజు అయిన అక్టోబర్ 2న ఓటీటీ రిలీజ్ చేస్తారని న్యూస్ వినిపిస్తోంది. అంటే, నెలకు మూడు రోజుల ముందుగానే గోట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

అయితే, గోట్ సినిమాను పూర్తి నిడివితో ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ చేయనున్నారని తెలుస్తోంది. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా నిడివి మొత్తంగా 3 గంటల 20 నిమిషాలు వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వెంకట్ ప్రభు తెలిపారు. కానీ, థియేటర్లలో నిడివి ఎక్కువ అవుతుందని దానిని 18 నిమిషాలకు కుదించాల్సి వచ్చిందట.

మరిన్ని యాక్షన్ సీన్స్

అలా థియేటర్లలో మూడు గంటల 2 నిమిషాల నిడివి ఉన్న గోట్‌ను రిలీజ్ చేశారని తెలుస్తోంది. కానీ, ఓటీటీలో మాత్రం థియేటర్లలో మిస్ అయిన యాక్షన్ అండ్ ఇతర సన్నివేశాలను జోడించి పూర్తి నిడివి (3 గంటల 20 నిమిషాలు)తో గోట్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం. ఇది విజయ్ అభిమానులకు మరింత కిక్ ఇచ్చే విషయం అని చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉంటే, గోట్ సినిమాలో విజయ్‌కు జోడీగా సీనియర్ హీరోయిన్ స్నేహా, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు. జీన్స్ ఫేమ్ ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, అజ్మల్ అమీర్, జయరామ్, లైలా, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ ఇతర కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.

గోట్ కథ విషయానికొస్తే.. చెన్నై కేంద్రంగా ఉన్న స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (SATS)లో పనిచేస్తున్న గూఢచారి గాంధీ చుట్టూ కథ తిరుగుతుంది. సాట్స్ కోసం పనిచేస్తున్నప్పుడు రా ఏజేన్సీ సమన్వయం చేసుకుంటుంది.

పదవీ విరమణ చేసిన తర్వాత, వారి మునుపటి చర్యల నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు గాంధీ కుమారుడు జీవన్ సహాయంతో పోరాడాల్సి వస్తుంది. ఈ చిత్రంలో దళపతి విజయ్ ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే.