70th National Awards: రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు.. ఉత్తమ సినిమాగా మలయాళ మూవీ.. కార్తికేయ 2కు జాతీయ అవార్డు-70th national film awards rishabh shetty is best actor for kantara and malayalam aatam win best film award ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  70th National Awards: రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు.. ఉత్తమ సినిమాగా మలయాళ మూవీ.. కార్తికేయ 2కు జాతీయ అవార్డు

70th National Awards: రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు.. ఉత్తమ సినిమాగా మలయాళ మూవీ.. కార్తికేయ 2కు జాతీయ అవార్డు

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 16, 2024 04:26 PM IST

70th National Film Awards: 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం నేడు (ఆగస్టు 16) వెల్లడించింది. కాంతార చిత్రంలో హీరోగా నటించిన కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రంగా ‘ఆట్టం’ పురస్కారం దక్కించుకుంది. ప్రాంతీయ విభాగంలో కార్తికేయ 2 మూవీకి నేషనల్ అవార్డు దక్కింది.

National Film Awards: రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు.. ఉత్తమ సినిమాగా మలయాళ మూవీ.. కార్తికేయ 2కు జాతీయ అవార్డు
National Film Awards: రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు.. ఉత్తమ సినిమాగా మలయాళ మూవీ.. కార్తికేయ 2కు జాతీయ అవార్డు

కన్నడ నటుడు రిషబ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 2022 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డులను సమాచార, ప్రసార శాఖ నేడు (ఆగస్టు 16) ప్రకటించింది. 2022 జనవరి 1వ తేదీన నుంచి 2022 డిసెంబర్‌ 31 మధ్య సెన్సార్ అయిన చిత్రాలకు పురస్కారాలను వెల్లడించింది.

కాంతార సినిమాకు గాను రిషబ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. గతేడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‍కు ఈ పురస్కారం దక్కగా.. ఇప్పుడు మరోసారి దక్షిణాది నటుడికే ఈ అవార్డు కైవసం అయింది. ఉత్తమ చిత్రంగా మలయాళ మూవీ ‘ఆట్టం’ నేషనల్ అవార్డు దక్కించుకుంది. ఈ మూవీ 2024లో థియేటర్లలో రిలీజైనా.. 2022లోనే సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక, తెలుగులో 2022కు గాను ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది. గతేడాది తెలుగు సినిమాలకు 10 జాతీయ అవార్డులు దక్కగా.. ఈసారి కార్తికేయ 2కు మినహా మరే పురస్కారం దక్కలేదు.

70వ జాతీయ అవార్డులు గెలిచిన ఫీచర్ సినిమాల జాబితా

ఉత్తమ సినిమా - ఆట్టం (మలయాళం)

ఉత్తమ దర్శకడు - సూరజ్ ఆర్ బడ్జాత్య (ఉంచాయ్ - హిందీ)

ఉత్తమ నటుడు - రిషబ్ శెట్టి (కాంతార - కన్నడ)

ఉత్తమ నటి - నిత్యామీనన్ (తిరుచిత్రాబలం - తమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్)

ఉత్తమ బాలనటుడు - శ్రీపథ్ (మాలికాపురం, మలయాళం)

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం - కాంతార (కన్నడ)

ఉత్తమ సహాయ నటుడు - పవన్ రాజ్ (ఫౌజా)

ఉత్తమ సహాయ నటి - నీనా గుప్తా (ఉంచాయి - హిందీ)

ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ - ప్రమోద్ కుమార్ (ఫౌజా - హిందీ)

ఉత్తమ సినిమాటోగ్రఫీ - రవివర్మన్ (పొన్నియన్ సెల్వన్ 1 - తమిళం)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - బ్రహ్మాస్త్ర పార్ట్-1 (హిందీ)

ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) - ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర పార్ట్-1 - హిందీ)

ఉత్తమ సంగీత దర్శకుడు (బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్) - ఏఆ రహమాన్ (పొన్నియిన్ సెల్వన్-1, తమిళం)

ఉత్తమ స్క్రీన్‍ప్లే - ఆనంద్ ఏకర్షి (ఆట్టం, మలయాళం)

ఉత్తమ మాటల రచయిత - అర్పితా ముఖర్జీ, రాహుల్ వీ చిట్టెల (గుల్‍మోహర్ - హిందీ)

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ - అన్బరివ్ (కేజీఎఫ్ చాప్టర్ 2, కన్నడ)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ - సోమనాథ్ కుందు (అపరాజితో)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - నిక్కీ జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్, హిందీ)

ఉత్తమ లిరిక్స్ - నౌషాద్ సర్దార్ ఖాన్ (ఫౌజాలో సలామీ పాట, హిందీ)

ఉత్తమ గాయకుడు - అర్జిత్ సింగ్ (బ్రహ్మాస్త్ 1లో కేసరియా పాట, హిందీ)

ఉత్తమ గాయకురాలు - బాంబే జయశ్రీ - (సౌదీ వెల్లక్కలో చాయుమ్ వెయిల్, మలయాళం)

ఉత్తమ డ్యాన్స్ కొరియోగ్రఫీ - జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్ (తిరుచిత్రాంబలంలోని మేఘం కరుకత పాట, తమిళం)

ఉత్తమ ఎడిటింగ్ - మహేశ్ భువనేంద్ (ఆట్టం, మలయాళం)

ప్రత్యేక జ్యూరీ అవార్డు - మనోజ్ బాజ్‍పేయ్ (గుల్‍మోహర్, హిందీ), సంజయ్ చౌదరి (కాధికాన్, హిందీ)

జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను చాటిన ఉత్తమ చిత్రం - కచ్ ఎక్స్‌ప్రెస్ (హిందీ)

ప్రాంతీయ విభాగంలో జాతీయ అవార్డులు

తెలుగులో ఉత్తమ సినిమా - కార్తికేయ 2

తమిళంలో ఉత్తమ సినిమా - పొన్నియిన్ సెల్వన్ 1

కన్నడలో ఉత్తమ సినిమా - కేజీఎఫ్ 2

మలయాళంలో ఉత్తమ సినిమా - సౌదీ వెల్లక్క

హిందీలో ఉత్తమ సినిమా - గల్‍మోహర్

(2022 జనవరి నుంచి 2022 డిసెంబర్ 31వ తేదీ మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలకు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2022 డిసెంబర్ 31లోగా సెన్సార్ పూర్తయి.. ఆ తర్వాత రిలీజైన చిత్రాలు కూడా ఇందులో ఉంటాయి. ఆట్టం చిత్రం 2024లో రిలీజైనా.. 2022 డిసెంబర్‌లోగానే సెన్సార్ పూర్తి చేసుకుంది.)

నాన్ ఫీచర్ విభాగంలో ఉత్తమ చిత్రంగా ఆయేనా నిలిచింది. బెస్ట్ డాక్యుమెంటరీగా మర్ముర్స్ పురస్కారం దక్కించుకుంది.