OTT Telugu Movie: నేరుగా ఓటీటీలోకి తెలుగు మైథాలజీ సినిమా.. అమ్మవారు శిక్షించే కాన్సెప్ట్‌తో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Kanyaka OTT Streaming: ఓటీటీలోకి నేరుగా తెలుగు మైథాలాజికల్ మూవీ కన్యక రానుంది. అమ్మవారి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 49 రూపాయలు చెల్లించి కొత్త ఓటీటీలో చూడొచ్చు. కన్యక చిత్రాన్ని బీసీనీట్ (Bcineet OTT) అనే సరికొత్త ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. మరి కన్యక ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..
Kanyaka OTT Release: ఇటీవల కాలంలో ఓటీటీలో హవా విపరీతంగా పెరిగిపోయింది. డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులు ప్రతి వారం వస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. కుప్పలుతెప్పలుగా వస్తున్న సినిమాలతో ఓటీటీల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇదివరకు కొన్ని పాపులర్ ఓటీటీలను మాత్రమే ఆడియెన్స్ ఉపయోగించేవారు.
డిజిటల్ స్ట్రీమింగ్
కానీ, ఈ మధ్య ఎప్పడో ఓసారి సరికొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ దర్శనం ఇస్తోంది. తాజాగా బీసీనీట్ (Bcineet OTT) అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తన సంస్థను విసృత పరుచుకునేందుకు తెలుగు సినిమాతో ఆడియెన్స్ ముందుకు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ రానుందని తెలుస్తోంది.
మైథాలాజికల్ కాన్సెప్ట్
అయితే, బీసీనీట్ ఓటీటీలో వస్తున్న తెలుగు సినిమా కన్యక. ఇండియన్ మైథాలాజికల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు పోస్టర్స్, టీజర్ చూస్తే తెలుస్తోంది. అమ్మవారి కథాంశంతో ఈ మూవీ రూపొందింది. మహిళల పట్ల తప్పుగా ప్రవర్తిస్తే అమ్మవారు తప్పకుండా శిక్ష విధిస్తుందనే అర్థంలో కన్యక మూవీ స్టోరీ ఉంది.
ఫెస్టివల్స్ సందర్భంగా
శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ బ్యానర్‌పై కన్యక మూవీని కేవీ అమర్, పూర్ణ చంద్రరావు, సాంబశివ రావు కూరపాటి నిర్మాతలుగా వ్యవహరించి నిర్మించారు. ఈ సినిమాకు రాఘవేంద్ర తిరువాయి పాటి దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 15న కన్యక మూవీలోని పాటలు విడుదల కాగా.. రాఖీ పండుగ సంద్రభంగా ఆగస్ట్ 20న కన్యక ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
వినాయక చవితికి ఓటీటీలో
ఇక తాజాగా కన్యక ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు దర్శకనిర్మాతలు. కన్యక సినిమాను వినాయక చవితి పండుగ సందర్భంగా నేరుగా ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే, బీసీనీట్ ఓటీటీలో సెప్టెంబర్ 7న కన్యక మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఇది రెంటల్ విధానం ఓటీటీ ప్లాట్‌ఫామ్. అందుకే రూ. 49 చెల్లించి కన్యకను చూడాలి.
మిగతా ఓటీటీల్లో కూడా
దీని తర్వాత రెగ్యులర్ ఓటీటీల్లో కన్యక సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. కన్యక ఓటీటీ రిలీజ్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా నిర్మాతలు కేవీ అమర్, సాంబశివరావు కూరపాటి, పూర్ణ చంద్రరావు మాట్లాడుతూ.. "బీసీనీట్ ద్వారా ఈ ఏడాది వినాయక చవితికి అన్ని ఓటీటీల్లో కన్యకను విడుదల చేస్తున్నాం" అని తెలిపారు.
కన్యక సాంకేతికవర్గం
ఇదిలా ఉంటే, కన్యక సినిమాలో శ్రీహరి, శివరామరాజు, జబర్దస్త్ వాసు, ఈశ్వర్, పీవీఎల్ వర ప్రసాదరావు, సర్కార్, ఫణిసూరి, ఆర్‌ఎమ్‌పీ వెంకట శేషయ్య, సాలిగ్రామం మమత, శిరీష, విజయ, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమాకు వెంకట్ టి మాటలు అందించగా.. విజయేంద్ర చేలో పాటలు రచించారు. అర్జున్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. నరేన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.