Saripodhaa Sanivaaram OTT: నెలకంటే ముందుగానే ఓటీటీలోకి నాని సరిపోదా శనివారం- రెండింట్లో రిలీజ్- స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Nani Saripodhaa Sanivaaram OTT Streaming Date: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ సరిపోదా శనివారం నెలకంటే ముందుగానే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఇవాళ (ఆగస్ట్ 29) థియేటర్లలో విడుదల కానున్న సరిపోదా శనివారం రెండు ఓటీటీల్లో రిలీజ్ కానుందని, స్ట్రీమింగ్ డేట్ ఇదే అని టాక్.
Saripodhaa Sanivaaram OTT Release: వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు నాని. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి హిట్ అందుకునే ప్రయత్నంగా నాని నుంచి వచ్చిన సినిమా సరిపోదా శనివారం. అంటే సుందరానికీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించారు.
సరిపోదా శనివారం రివ్యూలు
నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో ఇవాళ (ఆగస్ట్ 29) విడుదల కానుంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గురువారం రిలీజ్ కానుంది. అయితే, ఈపాటికే ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పడిపోయాయి. అవి చూసిన నెటిజన్స్ సరిపోదా శనివారంపై రివ్యూలు ఇస్తున్నారు.
సినిమాలో హీరో ఎంట్రీతోపాటు ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని, గూస్ బంప్స్ తెప్పించాయని నెటిజన్స్ చెబుతున్నారు. అలాగే రేసీ స్క్రీన్ ప్లే, హై ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌గా ఆకట్టుకునేలా సరిపోదా శనివారం మూవీ ఉందని కామెంట్స్ పెడుతున్నారు.
నాని-ఎస్‌జే సూర్య యాక్టింగ్
అలాగే మరోసారి మాస్ లుక్‌లో, సూర్య పాత్రలో నాని ఇరగదీశాడని అంటున్నారు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో పూర్తిగా డిఫరెంట్‌గా నాని కనిపించాడని చెబుతున్నారు. ఇక ఈ మూవీలో విలన్‌గా చేసిన డైరెక్టర్ అండ్ యాక్టర్ ఎస్‌జే సూర్య నటన అదిరిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కన్నింగ్ పోలీస్‌గా మరోసారి తన మార్క్ స్టైల్ యాక్టింగ్‌తో ఎస్‌జే సూర్య కట్టిపడేశాడని అంటున్నారు.
ఇదిలా ఉంటే, ఇవాళ ఈ మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ కూడా క్యూరియాసిటీగా మారింది. అయితే, సరిపోదా శనివారం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఈపాటికే లీక్ అయిపోయాయి. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ మంచి ధర వెచ్చించి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కొనుగోలు చేసిందని సమాచారం.
ఆ డేట్ నుంచి ఓటీటీ స్ట్రీమింగ్
అలాగే, ఈ మూవీ సెప్టెంబర్ నెలలో ఓటీటీ రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. సరిపోదా శనివారం ఓటీటీలో సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుందట. ఈ డేట్ నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో సరిపోదా శనివారం ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని పక్కా సమాచారం. అయితే, సరిపోదా శనివారం హిందీ వెర్షన్ మాత్రం మరో ఓటీటీ జియో సినిమాలో ప్రసారం కానుందట.
కానీ, సరిపోదా శనివారం హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదని సమాచారం. సౌత్ లాంగ్వెజెస్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అయిన కొన్ని రోజులకు అటు నెట్‌ఫ్లిక్స్, ఇటు జియో సినిమా రెండింట్లో సరిపోదా శనివారం హిందీ భాషలో కూడా డిజిటల్ ప్రీమియర్ కానుందట. ఇలా రెండు ఓటీటీల్లో నాని సరిపోదా శనివారం నెలకు మూడు రోజుల ముందుగానే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది.
కలెక్షన్స్, రెస్పాన్స్‌తో మార్పులు
అయితే, దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఇది ఓటీటీ వర్గాల నుంచి వచ్చిన కచ్చితమైన సమాచారం అని టాక్. కానీ, బాక్సాఫీస్ కలెక్షన్స్, ఆడియెన్స్ రెస్పాన్స్‌ను బట్టి సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ డేట్‌లో మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది.