OTT Trending Movies: ఓటీటీలో సత్తా చాటుతున్న హారర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు.. అన్ని ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో!
OTT Trending Movies On Jio Cinema: ఓటీటీల్లో పుష్కలమైన డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఉంటాయన్న విషయం తెలిసిందే. అలాగే ఈ ఓటీటీలో ఎన్నో గొప్ప హాలీవుడ్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని హారర్, క్రైమ్ అడ్వెంచర్ సినిమాలపై లుక్కేద్దాం.
(1 / 5)
అబిగైల్: జియో సినిమా ఓటీటీలో టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో హారర్ చిత్రం అబిగైల్ ఒకటి.అండర్ వరల్డ్ డాన్ కూతురిని కిడ్నాప్ చేసి పాత భవనంలో దాచిపెట్టే కథ అది. ఆ భవనంలో ఆమెకు ఎదురైన వింత అనుభవాల కథనంతో సాగుతుంది. ఇది జియో సినిమాలో ట్రెండ్ అవుతోంది. ఇంగ్లీషుతోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాళీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది.
(2 / 5)
అమెరికన్ సొసైటీ ఆఫ్ మ్యాజికల్ నీగ్రోస్ మూవీ ఒక కామెడీ థ్రిల్లర్. స్మిత్ అండ్ డెవిల్ అలెన్ నటించిన ఈ అమెరికన్ సొసైటీ ఆఫ్ మ్యాజికల్ నీగ్రోస్ మూవీ ట్రెండ్ అవుతోంది.
(3 / 5)
కిల్లర్: జియో సినిమా ఓటీటీలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ కిల్లర్. ఒక అంధురాలు తనను చంపడానికి ప్రయత్నించిన కొందరిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది, కిరాయి హంతకుడు ఆమెకు ఎలా సహాయం చేశాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
(4 / 5)
థియేటర్స్‌లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'ది కలెక్టివ్' చిత్రం ఇటీవల జియో సినిమా ఓటీటీలో విడుదలైంది. ఒక మహిళా ఏజెంట్ ప్రమాదకరమైన మానవ అక్రమ రవాణా ముఠాను ఎలా డీల్ చేస్తుందనే కథాంశంతో తెరకెక్కిన థ్రిల్లింగ్ అడ్వెంచర్ మూవీ జియో సినిమా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉంది.
ఇతర గ్యాలరీలు