తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Project K Release In 2 Parts: రెండు పార్ట్‌లుగా ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే - ఫ‌స్ట్ పార్ట్ రిలీజ్ ఎప్పుడంటే

Project K Release In 2 Parts: రెండు పార్ట్‌లుగా ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే - ఫ‌స్ట్ పార్ట్ రిలీజ్ ఎప్పుడంటే

02 February 2023, 8:11 IST

  • Project K Release In 2 Parts: ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే సినిమా రెండు పార్ట్‌లుగా రూపొంద‌నున్న‌ట్లు కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. ఈ సినిమా ఫ‌స్ట్ పార్ట్ వ‌చ్చే ఏడాది వేస‌విలో రిలీజ్ కానున్న‌ట్లు చెబుతున్నారు.

ప్ర‌భాస్
ప్ర‌భాస్

ప్ర‌భాస్

Project K Release In 2 Parts: ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే సినిమా విష‌యంలో మేక‌ర్స్ కొత్త నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సింగిల్ పార్ట్‌లో పూర్తి క‌థ‌ను చెప్ప‌డం సాధ్యం కాద‌నే ఆలోచ‌న‌తోనే రెండు భాగాలుగా ప్ర‌భాస్ సినిమాను తెర‌కెక్కించాల‌ని చిత్ర యూనిట్ నిర్ణ‌యించుకున్న‌ట్లుగా స‌మాచారం.

ట్రెండింగ్ వార్తలు

Pushpa Pushpa Song Lyrics: పుష్ప పుష్ప సాంగ్ లిరిక్స్ చూశారా? భూమి బద్ధలయ్యే పాట ఇది

SIT Telugu OTT: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌ అవుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ - స్ట్రీమింగ్ ఎక్క‌డ‌...ఎప్పుడంటే?

Guppedantha Manasu Serial: వ‌సుధార ప్లాన్ రివ‌ర్స్ - రాజీవ్ కుట్ర‌ల‌ను క‌నిపెట్టిన రిషి వైఫ్ - మ‌ను క‌ళ్ల‌లో భ‌యం

Krishna mukunda murari serial today: సరోగసి మథర్ గురించి నిజం దాచిన మురారి.. మీరాతో తిరగొద్దని మురారికి చెప్పిన కృష్ణ

ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో పూర్తికానున్న‌ట్లు తెలిసింది. ఏప్రిల్‌లో ప్రాజెక్ట్ కే పార్ట్ వ‌న్‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాను అక్టోబ‌ర్ 18న రిలీజ్ చేయాల‌నుకుంటున్న‌ట్లు నిర్మాత అశ్వ‌నీద‌త్ గ‌తంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కానీ షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో వ‌చ్చే ఏడాదికి రిలీజ్ డేట్‌ను షిప్ట్ చేసిన‌ట్లు చెబుతున్నారు.

సూప‌ర్ హీరో క‌థాంశంతో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. త‌న‌కున్న సూప‌ర్ ప‌వ‌ర్స్‌తో దుష్ట శ‌క్తుల‌పై ఓ యువ‌కుడు సాగించిన పోరాటం ఆధారంగా ఈ సినిమా రూపొంద‌నుంది. ఇందులో ప్ర‌భాస్‌కు జోడీగా దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈసినిమాతోనే హీరోయిన్‌గా దీపికా ప‌డుకోణ్ తెలుగులో అరంగేట్రం చేస్తోంది.

బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ అమితాబ్‌బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్‌ దాదాపు నాలుగు వంద‌ల కోట్ల వ్య‌యంతో పాన్ ఇండియ‌న్ స్థాయిలో ప్రాజెక్ట్ కే సినిమాను నిర్మిస్తోన్నారు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న సినిమాల్లో ఒక‌టిగా ప్రాజెక్ట్ కే నిల‌వ‌నుంది.

ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ కేతో పాటు ప్ర‌శాంత్‌నీల్‌తో స‌లార్ సినిమా చేస్తోన్నాడు ప్ర‌భాస్‌. అలాగే ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో న‌టించిన ఆదిపురుష్ జూన్ 16న రిలీజ్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.