Salaar Release Date: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - స‌లార్ రిలీజ్ డేట్‌లో ఛేంజ్ లేదు - మేక‌ర్స్ క్లారిటీ-prabhas salaar release date makers clarity on salaar release postpone rumours ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Salaar Release Date Makers Clarity On Salaar Release Postpone Rumours

Salaar Release Date: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - స‌లార్ రిలీజ్ డేట్‌లో ఛేంజ్ లేదు - మేక‌ర్స్ క్లారిటీ

Nelki Naresh Kumar HT Telugu
Jan 21, 2023 10:47 PM IST

Salaar Release Date: ప్ర‌భాస్ స‌లార్ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌ల‌పై శ‌నివారం మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చారు. రిలీజ్ డేట్‌లో మార్పు లేదని ప్ర‌క‌టించారు.

ప్ర‌భాస్
ప్ర‌భాస్

Salaar Release Date: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు స‌లార్ టీమ్ గుడ్‌న్యూస్ వినిపించింది. ఈ సినిమా పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు జ‌రుగుతోన్న ప్ర‌చారాన్ని ఖండించింది. గ్యాంగ్‌స్టార్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు ప్ర‌శాంత్‌నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డ‌నున్న‌ట్లు కొంత‌కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి.

షూటింగ్ ఆల‌స్యమ‌య్యే అవ‌కాశం ఉండ‌టంతో సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మే నంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌కు చిత్ర యూనిట్ పుల్‌స్టాప్ పెట్టింది. స‌లార్ సినిమాను మ‌రో 250 రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాబోతున్న‌ట్లు అనౌన్స్‌చేసింది.

స‌లార్ యూనిట్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్‌తో ప్ర‌భాస్ అభిమానుల్లో ఆనందం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం స‌లార్ షూటింగ్ హైద‌రాబాద్‌లోని రామెజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతోంది. ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్‌సుకుమార‌న్‌ల‌పై కీలక స‌న్నివేశాల‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాలో వ‌ర‌దా రాజా మ‌న్నార్ అనే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో పృథ్వీరాజ్‌సుకుమార‌న్ క‌నిపించ‌బోతున్నాడు.

శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. హోంబ‌లే ఫిల్మ్స్ ప‌తాకంపై విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో ద‌క్షిణాదిభాష‌ల‌తో పాటు హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

స‌లార్‌తో పాటు ప్ర‌స్తుతం ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు ప్ర‌భాస్‌. అలాగే మారుతి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు.

IPL_Entry_Point