తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pareshan Movie Ott: పరేషాన్ సినిమా వచ్చేది ఈ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే..

Pareshan Movie OTT: పరేషాన్ సినిమా వచ్చేది ఈ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే..

02 June 2023, 16:18 IST

    • Pareshan Movie OTT: తిరువీర్ హీరోగా తెరకెక్కిన పరేషాన్ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ను లాక్ చేసుకుంది. నేడే ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పరేషాన్ సినిమా పోస్టర్
పరేషాన్ సినిమా పోస్టర్

పరేషాన్ సినిమా పోస్టర్

Pareshan Movie OTT: తెలంగాణ బ్యాక్‍డ్రాప్‍లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా పరేషాన్ మూవీ తెరకెక్కింది. ‘మసూదా’ ఫేమ్ తిరువీర్ హీరోగా నటించిన ఈ చిత్రం నేడు (జూన్ 2) థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా సమర్పణలో వచ్చిన ఈ పరేషాన్ సినిమా.. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. అయితే, తిరువీర్ నటనకు మాత్రం జనాలు ఫిదా అయిపోతున్నారు. కాగా, ఈ పరేషాన్ సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ డీల్ లాక్ చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

OTT Releases this week: ఓటీటీలో ఈ వారం ఏకంగా 21 సినిమాలు.. ఇంట్రెస్టింగ్‌గా 7.. ఎక్కడ చూడాలంటే?

The Broken News Season 2 Review: క్లైమ్యాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చే న్యూస్‌రూమ్ డ్రామా.. చూడాల్సిన వెబ్ సిరీసే..

Dimple Kapadia: 15 ఏళ్లకే ప్రెగ్నెంట్.. స్టార్ హీరోతో బెడిసికొట్టిన పెళ్లి.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?

Guppedantha Manasu May 6th Episode: గుప్పెడంత మనసు- ఫిటింగ్ పెట్టిన వసుధార- శైలేంద్ర బిగ్ ట్విస్ట్- దొరికిపోయిన మహేంద్ర

సోనీ లివ్ (Sony Liv) ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో పరేషాన్ సినిమా రానుంది. ఆ ప్లాట్‍ఫామ్ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను చేజిక్కించుకుంది. అయితే, సోనీ లివ్‍లో ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతుందో ఇంకా స్పష్టత రాలేదు. ఈ చిత్రం నేడే విడుదల కావటంతో ఓటీటీలోకి వచ్చే సరికి మరిన్ని వారాలు పట్టే అవకాశం ఉంది.

రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో పరేషాన్ సినిమా రూపొందింది. ఈ సినిమాలో తిరువీర్‌కు జోడీగా పావని కరణం నటించింది. సిద్దార్థ్ రాళ్లపల్లి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. వాల్తేరు ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మితమైంది. ఈ సినిమాను ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా సమర్పించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించగా.. వాసు పెండెం సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.

జార్జిరెడ్డి, టక్ జగదీశ్ సినిమాలతో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు తిరువీర్. ఇక ఆ తర్వాత హర్రర్ మూవీ ‘మసూద’ సినిమాలో హీరోగా నటించి అదరగొట్టాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు. కమర్షియల్‍గానూ మసూద మూవీ మంచి విజయాన్ని సాధించింది. దీంతో పక్కా హీరోగా మారిపోయాడు తిరువీర్. పరేషాన్‍లో తెలంగాణ యాసతో ఆకట్టుకుంటున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.