తెలుగు న్యూస్  /  Entertainment  /  Ntr Prashanth Neel Movie Update Ntr 31 To Go On Floors In September

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ మూవీ సెట్స్‌పైకి వెళ్లేది ఎప్పుడంటే

05 February 2023, 9:40 IST

  • Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడు మొద‌లుకానుందంటే...

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్

Ntr Prashanth Neel Movie: ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్‌. గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా 1200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యి చ‌రిత్ర‌ను సృష్టించింది.

ట్రెండింగ్ వార్తలు

OTT Top Releases in May: మే నెలలో ఓటీటీల్లో 5 ముఖ్యమైన రిలీజ్‍లు ఇవే.. సూపర్ హిట్ సినిమాలు.. ఓ భారీ వెబ్ సిరీస్

Vishwak Sen: ఇండియాలోనే గొప్ప నటుడు జూనియర్ ఎన్టీఆర్: విశ్వక్‍సేన్.. ఇంటెన్స్ యాక్షన్‍తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్

Kalki 2898 AD Release Date: ఉత్కంఠకు తెర.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఖరారు.. అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్

Prasanth Varma: బాలీవుడ్ స్టార్‌ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా అందులో భాగమే.. జై హనుమాన్ కంటే ముందే!

ఆర్ఆర్ఆర్ రిలీజై దాదాపు ఏడాది కావ‌స్తోన్న ఇప్ప‌టివ‌ర‌కు నెక్స్ట్ సినిమా షూటింగ్ మొద‌లుపెట్ట‌లేదు ఎన్టీఆర్‌. త్వ‌ర‌లోనే కొర‌టాల శివ మూవీ సెట్స్‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. మార్చిలో ఎన్టీఆర్‌- కొర‌టాల శివ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబ‌ర్‌లో ప్రారంభంకానున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమా చేస్తున్నాడు ప్ర‌శాంత్ నీల్‌. ఆగ‌స్ట్ నెలాఖ‌రులోగా స‌లార్ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. ప్ర‌భాస్ సినిమా షూటింగ్ పూర్త‌వ్వ‌గానే గ్యాప్ లేకుండా వెంట‌నే ఎన్టీఆర్ సినిమాను ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌శాంత్ నీల్ స‌న్నాహాలు చేస్తోన్న‌ట్లు చెబుతున్నారు. ఎ

న్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా గ‌త మే నెల‌లో ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పొడ‌వైన గ‌డ్డం, మీస‌క‌ట్టుతో ఎన్టీఆర్ క‌నిపించారు. భూమిపుత్రుడుగా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో ఎన్టీఆర్ క‌న‌పించ‌బోతున్న‌ట్లు ప్ర‌శాంత్ నీల్ అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్‌ఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.