Shah Rukh Khan to Ram Charan: మీ ఆస్కార్‌ను కాస్త టచ్‌ చేయనీయండి.. రామ్‌చరణ్‌కు షారుక్‌ తెలుగు ట్వీట్‌ వైరల్‌-shah rukh khan to ram charan asks to let him touch the ocar they win for rrr ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shah Rukh Khan To Ram Charan Asks To Let Him Touch The Ocar They Win For Rrr

Shah Rukh Khan to Ram Charan: మీ ఆస్కార్‌ను కాస్త టచ్‌ చేయనీయండి.. రామ్‌చరణ్‌కు షారుక్‌ తెలుగు ట్వీట్‌ వైరల్‌

Hari Prasad S HT Telugu
Jan 10, 2023 04:22 PM IST

Shah Rukh Khan to Ram Charan: మీ ఆస్కార్‌ను కాస్త టచ్‌ చేయనీయండి అంటూ రామ్‌చరణ్‌కు షారుక్‌ చేసిన తెలుగు ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. పఠాన్‌ ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా ఈ ఇద్దరి మధ్య ట్విటర్‌లో సరదా చిట్‌చాట్‌ సాగింది.

షారుక్ ఖాన్, రామ్ చరణ్
షారుక్ ఖాన్, రామ్ చరణ్

Shah Rukh Khan to Ram Charan: బాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత షారుక్ ఖాన్‌ నటించిన సినిమా పఠాన్‌. ఈ మూవీ జనవరి 25న రిలీజ్‌ కానుండగా.. మంగళవారం (జనవరి 10) ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను షారుక్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై మెగాపవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ స్పందిస్తూ.. పఠాన్‌ టీమ్‌కు కంగ్రాట్స్‌ చెప్పాడు.

దీనికి షారుక్‌ కూడా స్పందిస్తూ.. మీరు ఆస్కార్‌ను ఇంటికి తెచ్చినప్పుడు నన్ను దానిని టచ్‌ చేయనీయండి అంటూ రిప్లై ఇవ్వడం విశేషం. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. మొదట షారుక్‌ పఠాన్‌ ట్రైలర్‌పై రామ్‌చరణ్‌ స్పందించాడు.

"పఠాన్‌ టీమ్‌ మొత్తానికి ఆల్‌ ద వెరీ బెస్ట్‌. షారుక్‌ సర్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా మిమ్మల్ని యాక్షన్‌ సీన్స్‌లో చూడటానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని రామ్‌చరణ్‌ అన్నాడు. దీనికి షారుక్‌ రిప్లై ఇస్తూ.. "థ్యాంక్యూ సో మచ్‌ మై మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. మీ ఆర్ఆర్‌ఆర్ టీమ్‌ ఇండియాకు ఆస్కార్‌ను తీసుకొచ్చినప్పుడు దయచేసి దానిని టచ్‌ చేయనివ్వండి" అని అన్నాడు. ఇదే ట్వీట్‌లో ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ షారుక్‌ రాయడం విశేషం.

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రెండు కేటగిరీల్లో ఆస్కార్స్‌కు షార్ట్‌లిస్ట్‌ అయిన విషయం తెలిసిందే. బెస్ట్‌ మూవీతోపాటు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీల్లో ఈ సినిమా పోటీ పడనుంది. ఆర్ఆర్ఆర్‌తోపాటు కాంతారా, ది కశ్మీర్‌ ఫైల్స్‌, గంగూబాయి కఠియావాడి సినిమాలు కూడా ఆస్కార్స్‌ రేసులో ఉన్నాయి.

మరోవైపు కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్ కూడా పఠాన్‌ ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా షారుక్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పాడు. దీనికి కింగ్‌ ఖాన్‌ రిప్లై ఇస్తూ.. తమిళంలోనూ ట్వీట్‌ చేయడం విశేషం. నిన్ను అందుకే దళపతి అంటారు.. త్వరలోనే మనం కలిసి మంచి ఫుడ్‌ ఎంజాయ్ చేద్దాం అని షారుక్ ట్వీట్‌ చేశాడు.

పఠాన్‌ మూవీ జనవరి 25న రిలీజ్‌ కాబోతోంది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాలో దీపికా పదుకోన్‌, జాన్‌ అబ్రహం కూడా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ ఖాయమని ఈ ట్రైలర్‌ చూస్తే స్పష్టమవుతోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం