Pathaan Trailer Out: ఫుల్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో దుమ్ము రేపిన పఠాన్‌ ట్రైలర్‌-pathaan trailer out with full of action and chasing scenes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Pathaan Trailer Out With Full Of Action And Chasing Scenes

Pathaan Trailer Out: ఫుల్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో దుమ్ము రేపిన పఠాన్‌ ట్రైలర్‌

Hari Prasad S HT Telugu
Jan 10, 2023 11:35 AM IST

Pathaan Trailer Out: ఫుల్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో పఠాన్‌ ట్రైలర్‌ దుమ్ము రేపింది. పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌, ఉత్కంఠ రేపే చేజింగ్‌, యాక్షన్‌ సీన్స్‌తో ఈ ట్రైలర్‌ మొత్తం సాగింది.

పఠాన్ మూవీలో షారుక్ ఖాన్
పఠాన్ మూవీలో షారుక్ ఖాన్

Pathaan Trailer Out: బాలీవుడ్‌లోనే కాదు ఇండియా మొత్తం ఇప్పుడు ఎక్కువ మంది ఎదురు చూస్తున్న సినిమా పఠాన్‌. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బేషరమ్‌ రంగ్‌ పాటతో వివాదాల్లో ఇరుక్కున్న ఈ సినిమా నుంచి తాజాగా మంగళవారం (జనవరి 10) ట్రైలర్‌ రిలీజైంది. అయితే ఈ ట్రైలర్‌ మూవీపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.

ఈ మూవీలో హీరో, విలన్లుగా నటించిన షారుక్‌ఖాన్, జాన్‌ అబ్రహం మధ్య ఉన్న యాక్షన్‌, చేజింగ్‌ సీన్లు హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాయి. దీనికితోడు షారుక్‌ నోట పవర్‌ ఫుల్‌ దేశభక్తి డైలాగులు కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. ఇక విద్రోహ శక్తుల నుంచి దేశాన్ని రక్షించే పనిలో ఉన్న హీరోకు సాయపడే పాత్రలో దీపికా కనిపిస్తోంది.

ఇందులో ఆమె చేసిన స్టంట్స్‌ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ ట్రైలర్‌ను షారుక్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు. "ఇంటికి వచ్చిన అతిథికి ఆతిథ్యం ఇవ్వడానికి పఠాన్‌ వస్తున్నాడు.. అలాగే తన వెంట పటాకులు కూడా తీసుకొస్తున్నాడు. పఠాన్‌ ట్రైలర్‌ వచ్చేసింది" అంటూ షారుక్‌ ఈ ట్రైలర్‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు.

నిజానికి షారుక్‌ రాసిన క్యాప్షన్‌ పఠాన్‌ సినిమాలోని ఓ డైలాగ్‌. దేశంపై జరగబోతున్న అతిపెద్ద యుద్ధాన్ని తప్పించాలంటే వనవాసంలో ఉన్న పఠాన్‌ బయటకు రావాల్సిందే అంటూ డింపుల్‌ కపాడియా చెప్పే డైలాగ్‌ తర్వాత కింగ్‌ ఖాన్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచీ ట్రైలర్‌ మొత్తం ఫుల్‌ యాక్షన్‌, పవర్‌ ఫుల్‌ డైలాగ్సే ఉన్నాయి.

పఠాన్‌ సినిమాకు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. తన చివరి మూవీ జీరో చేసిన తర్వాత నాలుగేళ్లకు ఈ పఠాన్‌ సినిమా వస్తోంది. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగినట్లే ట్రైలర్‌ ఉంది. పఠాన్‌ సినిమాతోపాటు షారుక్‌ ఖాన్‌ జవాన్‌, డంకీలాంటి సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

IPL_Entry_Point