Pathaan Censor Cuts: దీపికా పిరుదులు కనిపించే సీన్‌తోపాటు పఠాన్‌కు 13 కట్స్
Pathaan Censor Cuts: దీపికా పదుకోన్ పిరుదులు కనిపించే సీన్‌తోపాటు పఠాన్‌కు మొత్తం 13 కట్స్ చెప్పింది సెన్సార్ బోర్డు. ముఖ్యంగా ఈ సినిమాలో వివాదాస్పదమైన బేషరమ్ రంగ్ పాటలోనూ ఈ కట్స్ ఉన్నాయి.
Pathaan Censor Cuts: బాలీవుడ్ నటీనటులు షారుక్‌ఖాన్, దీపికా పదుకోన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత కింగ్ ఖాన్ నటించిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ బాలీవుడ్‌లో వరుస ఫ్లాపుల నేపథ్యంలో ఈ సినిమాపై ఆ ఇండస్ట్రీ కూడా భారీ ఆశలే పెట్టుకుంది.
అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే వివాదాల్లో ఇరుక్కుంది. ముఖ్యంగా ఈ మూవీ నుంచి వచ్చిన బేషరమ్ రంగ్ పాటపై తీవ్ర దుమారం రేగింది. ఇందులో దీపికా కాషాయ రంగు బికినీ వేసుకోవడంపై పలువురు హిందూ మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఏం చేస్తుందా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
అయితే ఈ కాషాయ బికినీపై ఏమాత్రం స్పందించని సెన్సార్ బోర్డు.. మూవీకి మాత్రం మొత్తం 13 కట్స్ చెప్పింది. బేషరమ్ రంగ్ పాటలో దీపికా పిరుదులు కనిపించే సీన్‌తోపాటు ఆమె వక్షోజాలు ఎక్స్‌పోజ్ అయ్యే మరో సీన్‌ను కూడా కట్ చేయాలని ఆదేశించింది. ఇక ఇదే పాటలో బహుత్ తంగ్ కియా అనే లిరిక్స్ వచ్చే సమయంలో దీపికా వేసే అభ్యంతకర స్టెప్పులను కూడా కట్ చేయాలని స్పష్టం చేసింది.
ఇవే కాకుండా మొత్తంగా సినిమాలో 13 కట్స్ సూచించి u/a సర్టిఫికెట్ ఇచ్చింది. అసలు వివాదానికి కారణమైన కాషాయ రంగు బికినీ మాత్రం ఈ కట్స్‌లో లేటన్లు సమాచారం. ఇక సినిమాలో రా, పీఎంవోలాంటి పదాలను తరచూ వాడారు. రా (RAW) స్థానంలో హమారే అనే పదం వాడనున్నారు. పీఎంవో పదాన్ని తొలగించారు. పీఎం అన్న పదం స్థానంలో ప్రెసిడెంట్ లేదా మినిస్టర్ అనే పదాలు వాడాలని నిర్ణయించారు.
ఇక మిసెస్ భారతమాతా అనే పదం కూడా ఈ సినిమాలో ఉంది. దానిపై కూడా సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో దానిని హమారీ భారతమాతాగా మార్చారు. అశోక చక్రను వీర్ పురస్కార్‌గా మార్చడంతోపాటు సినిమాలో రష్యా గురించి ఉన్న డైలాగ్‌ను కూడా తొలగించారు.
సంబంధిత కథనం