Shah Rukh Khan in 50 greatest actors list: ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ యాక్టర్స్‌ లిస్ట్‌లో షారుక్‌ ఖాన్‌-shahrukh khan in 50 greatest actors list of empire magazine ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Shahrukh Khan In 50 Greatest Actors List Of Empire Magazine

Shah Rukh Khan in 50 greatest actors list: ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ యాక్టర్స్‌ లిస్ట్‌లో షారుక్‌ ఖాన్‌

HT Telugu Desk HT Telugu
Dec 20, 2022 09:15 PM IST

Shah Rukh Khan in 50 greatest actors list: ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ యాక్టర్స్‌ లిస్ట్‌లో చోటు సంపాదించాడు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 మంది ఇందులో ఉండగా.. ఇండియా నుంచి అతనికి మాత్రమే చోటు దక్కింది.

షారుక్ ఖాన్
షారుక్ ఖాన్ (Twitter)

Shah Rukh Khan in 50 greatest actors list: బాలీవుడ్‌ను మూడు దశాబ్దాలుగా ఏలుతున్న నటుడు షారుక్ ఖాన్‌. ఇప్పుడు చాలా రోజుల తర్వాత పఠాన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ బాలీవుడ్‌ బాద్‌షా.. ఇప్పుడు ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ప్రపంచంలోని ప్రముఖ మ్యాగజైన్లలో ఒకటైన ఎంపైర్‌ రిలీజ్‌ చేసిన 50 గ్రేటెస్ట్‌ యాక్టర్స్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ లిస్ట్‌లో షారుక్‌ చోటు సంపాదించాడు. ఈ లిస్ట్‌లో స్థానం దక్కించుకున్న ఏకైక ఇండియన్‌ యాక్టర్‌గా కింగ్‌ ఖాన్‌ నిలిచాడు. ఈ 50 మంది నటుల లిస్ట్‌ను ఎంపైర్‌ మ్యాగజైన్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో ఉంచింది. సినీ అభిమానులు వేసిన ఓట్ల ప్రకారం ఈ లిస్ట్‌ను తయారు చేసినట్లు వెల్లడించింది.

"ఎంపైర్‌ మ్యాగజైన్‌ 50 గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ లిస్ట్‌ రిలీజైంది. మీరు వేసిన ఓట్ల ప్రకారం మా కొత్త సంచికలో ఈ లిస్ట్‌ను ఉంచాం" అని తమ సోషల్‌ మీడియా అకౌంట్‌లో రాసింది. ఇక షారుక్‌ గురించి కూడా ఈ మ్యాగజైన్‌ ఎంతో గొప్పగా చెప్పింది. నాలుగు దశాబ్దాలుగా అతడు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడని తెలిపింది.

"మిస్టర్‌ మార్వెల్‌ ఫేవరెట్‌ మూవీ స్టార్‌ కెరీర్‌ ఇప్పుడు నాలుగు దశాబ్దాలుగా సాగుతోంది. కోట్లాది మంది అభిమానులు అతనికి ఉన్నారు. సాటిలేని చరిష్మా, తమ కళపై అత్యద్భుతమైన పట్టు సాధిస్తేగానీ ఇది సాధ్యం కాదు. అతడు ప్రతి జానర్‌లోనూ ఎంతో సౌకర్యవంతంగా కనిపిస్తాడు. అతడు చేయలేనిది అంటూ ఏదీ లేదు" అని ఎంపైర్‌ మ్యాగజైన్‌ షారుక్‌పై ప్రశంసలు కురిపించింది.

ఈ లిస్ట్‌లో హాలీవుడ్‌ నటులైన డెంజెల్‌ వాషింగ్టన్‌, టామ్ క్రూజ్, టామ్‌ హ్యాంక్స్‌, మార్లిన్‌ మన్రో, హీత్‌ లెడ్జర్‌, లియెనార్డో డికాప్రియో, నికొలస్‌ కేజ్‌, మార్లన్‌ బ్రాండో, మెరిల్‌ స్ట్రీప్‌లాంటి వాళ్లు ఉన్నారు.

IPL_Entry_Point

టాపిక్