Ram Charan and KTR in Unstoppable: అన్‌స్టాపబుల్ సీజన్ 2 పేరుకు తగినట్లే అసలు అడ్డు లేకుండా దూసుకెళ్తోంది. ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో గెస్ట్ పేరు వింటుంటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో బాలయ్య బాబు చేసిన టాక్ షో ఒక ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అయింది. ఇక శుక్రవారం (జనవరి 6) రెండో ఎపిసోడ్ కూడా స్ట్రీమ్ కానుంది. ఇందులో ప్రభాస్‌తోపాటు గోపీచంద్ కూడా సందడి చేయనున్నాడు.,ఇది కాకుండా ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తోనూ మరో ఎపిసోడ్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి షూటింగ్ కూడా ఈ మధ్యే జరిగింది. ఆ ఎపిసోడ్ కోసం పవన్ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా అన్‌స్టాపబుల్ షోకు వస్తున్నట్లు సమాచారం. అతడు ఒక్కడే కాదు.. ఈ ఎపిసోడ్‌కు చెర్రీ ఫ్రెండ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ రానుండటం మరో విశేషం.,ఈ ఇద్దరి కాంబినేషన్‌లో టాక్ షో, అది కూడా బాలకృష్ణతో అంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఆహా ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన చేయకపోయినా.. వీళ్ల ఎపిసోడ్ పక్కా అని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే చెర్రీ ఫ్యాన్స్‌కు కూడా పండగే.,అన్‌స్టాపబుల్ తొలి సీజన్ కంటే రెండో సీజన్‌లో ఆహా చాలా దూకుడు మీద ఉంది. వరుసగా పెద్ద హీరోలను ఈ షోకు తీసుకురావడంలో సక్సెస్ అవుతోంది. ఈ హీరోలు ఓ టాక్ షోలో సరదాగా తమ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం, బాలయ్య బాబు స్టైల్ ప్రశ్నలు ఎవరికి మాత్రం ఆసక్తి రేపవు చెప్పండి.,పైగా దీనికి గెస్ట్‌ల ఎంపిక విషయంలోనూ ఆహా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రెండో సీజన్ తొలి ఎపిసోడ్‌లోనే చంద్రబాబు, లోకేష్‌లను రప్పించింది. తన బావ, అల్లుడిని బాలయ్య ఇంటర్వ్యూ చేసిన ఎపిసోడ్ రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత కూడా మహేష్ బాబు, విశ్వక్‌సేన్, సిద్దూ జొన్నలగడ్డ, ప్రభాస్, గోపీచంద్, పవన్ కల్యాణ్.. తాజాగా రామ్‌చరణ్, కేటీఆర్ ఇలా గెస్ట్‌ల పేర్లతోనే అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. ఈ షో సక్సెస్ ఆహా ఓటీటీని కూడా మరో రేంజ్‌కు తీసుకెళ్తోంది.,