Jr NTR in Oscars Race: ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌-jr ntr in oscars race as he became first indian actor to achieve this ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Jr Ntr In Oscars Race As He Became First Indian Actor To Achieve This

Jr NTR in Oscars Race: ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌

Hari Prasad S HT Telugu
Jan 05, 2023 01:33 PM IST

Jr NTR in Oscars Race: ఇంత వరకూ ఏ భారతీయ నటుడికీ దక్కని ఘనతను సొంతం చేసుకున్నాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఆర్ఆర్‌ఆర్‌ మూవీ నుంచి ఆస్కార్స్‌ రేసులో ఉన్న తారక్‌ సాధించిన ఆ ఘనతేంటో ఒకసారి చూద్దాం.

RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్
RRR మూవీలో జూనియర్ ఎన్టీఆర్ (Twitter)

Jr NTR in Oscars Race: దర్శక ధీరుడిగా పేరుగాంచిన రాజమౌళి తెరకెక్కించిన మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమా రిలీజై పది నెలలవుతోంది. అయినా ప్రతిసారీ ఏదో ఒక విశేషంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో హీరోలుగా నటించిన వాళ్లలో ఒకడైన జూనియర్‌ ఎన్టీఆర్‌.. ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ ఆస్కార్స్‌ రేసులో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ను కూడా అకాడెమీ అధికారికంగా బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీ కోసం షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఇక ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఆస్కార్స్‌ రేసులో నిలిచాడు. ప్రపంచంలోని పాపులర్‌ మ్యాగజైన్లలో ఒకటైన వెరైటీ అంచనా ప్రకారం ఆస్కార్స్‌ రేసులో ఉన్న టాప్ 10 బెస్ట్‌ యాక్టర్స్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఉన్నాడు.

ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడు తారక్‌ కావడం విశేషం. గతంలో ఏ ఇతర భారతీయ నటుడు ఇలా టాప్‌10 రేసులోకి రాలేదు. ఆర్ఆర్ఆర్‌లో అతడు పోషించిన భీమ్‌ పాత్ర చూసి ఎంతో మంది హాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు.

మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గోల్డెన్‌ గ్లోబ్స్‌లో రెండు కేటగిరీల్లో నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల కోసం భార్య ఉపాసనతో కలిసి రామ్‌ చరణ్‌ లాస్‌ ఏంజిల్స్‌ వెళ్లాడు. ఇక అక్కడే ఉన్న టీఎల్‌సీ చైనీస్‌ థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్ స్పెషల్‌ స్క్రీనింగ్‌కు రామ్‌చరణ్‌తోపాటు రాజమౌళి, ఎన్టీఆర్ హాజరు కానున్నారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఐమ్యాక్స్‌ థియేటర్‌ కావడం విశేషం.

IPL_Entry_Point