తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara Gujarati Movie: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్‌తో గుజ‌రాతీ సినిమా చేస్తోన్న న‌య‌న‌తార‌

Nayanthara Gujarati Movie: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్‌తో గుజ‌రాతీ సినిమా చేస్తోన్న న‌య‌న‌తార‌

20 March 2023, 9:06 IST

  • Nayanthara Gujarati Movie: గుజ‌రాతీ సినిమాల్లోకి న‌య‌న‌తార ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. అయితే యాక్ట‌ర్‌గా కాదు. ప్రొడ్యూస‌ర్‌గా. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తోనే ఓ సినిమా చేయ‌బోతున్న‌ది. ఆ సినిమా ఏదంటే...

మోనాల్ గ‌జ్జ‌ర్
మోనాల్ గ‌జ్జ‌ర్

మోనాల్ గ‌జ్జ‌ర్

Nayanthara Gujarati Movie: ద‌క్షిణాదితోపాటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ హీరోయిన్‌గా బిజీగా ఉన్న న‌య‌న‌తార గుజ‌రాతీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. అయితే యాక్ట‌ర్‌గా కాదు ప్రొడ్యూస‌ర్‌గా గుజ‌రాతీ భాష‌లో ఓ సినిమా చేయ‌బోతున్న‌ది. రౌడీ పిక్చ‌ర్స్ పేరుతో భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌ను స్టార్ట్ చేసిన న‌య‌న‌తార చిన్న సినిమాల్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Vidya Vasula Aham OTT: ఓటీటీలోకి నేరుగా వస్తున్న శివానీ రాజశేఖర్ ‘విద్యా వాసుల అహం’ సినిమా

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

ఇప్ప‌టివ‌ర‌కు త‌మిళంలోనే సినిమాల్నిప్రొడ్యూస్ చేసిన న‌య‌న్‌, విఘ్నేష్ తొలిసారి ఓ గుజ‌రాతీ సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. శుభ్‌యాత్ర పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో మ‌ల్హ‌ర్ ట‌క్క‌ర్‌, మోనాల్ గ‌జ్జ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ఈ సినిమాకు నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ మ‌నీష్ సైనీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు.

హీరోయిన్ మోనాల్ గ‌జ్జ‌ర్ కెరీర్ తెలుగు సినిమాల‌తోనే మొద‌లైంది. అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టించిన సుడిగాడు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ స‌క్సెస్ త‌ర్వాత తెలుగులో బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాలి, దేవ‌దాసి సినిమాలు చేసింది. హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో స‌క్సెస్‌లు రాక‌పోవ‌డంతో తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది. ఫైన‌ల్‌లో వెనుదిరిగింది.

బిగ్‌బాస్ త‌న కెరీర్‌కు హెల్ప్ చేస్తుంద‌ని అనుకున్నా అది క‌ల‌గానే మిగిలిపోయింది. కొన్నాళ్లుగా మాతృభాష గుజ‌రాతీ సినిమాల‌పై దృష్టిసారిస్తోంది మోనాల్ గ‌జ్జ‌ర్‌. ప్ర‌స్తుతం శుభ్‌యాత్ర సినిమాపై భారీగా ఆశ‌లుపెట్టుకున్న‌ది.

ఆమెకు న‌య‌న‌తార అయినా బ్రేక్ ఇస్తుందో లేదో అన్న‌ది తెలియాలంటే ఏప్రిల్ 28 వ‌ర‌కు ఆగాల్సిందే. ఈ సినిమా థియేట‌ర్ల‌లో ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. నిర్మాత‌గా త‌మిళంలో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న న‌య‌న‌తా, విఘ్నేష్‌శివ‌న్‌ల‌కు గుజ‌రాతీ ఎంట్రీ ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.