Payal Ghosh on MeToo: గ్లోబల్ స్టార్ ఎన్‌టీఆర్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఊసరవెళ్లి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా కాకుండా.. ఆమె స్నేహితురాలి పాత్రలో పాయల్ ఘోష్ నటించింది. తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి వీలు చిక్కినప్పుడల్లా ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అంతేకాకుండా ఎన్‌టీఆర్‌కు మద్దతుగా మాట్లాడుతూ అతడితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ మర్చిపోలేనని పలు సందర్భాల్లో తెలిపింది. అయితే సౌత్ సినిమాలపై సానుకూలంగా మాట్లాడటంతో కొంతమంది ఆమెను ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. తాజాగా వీటిపై స్పందించిన ఈ ముద్దుగుమ్మ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ బాలీవుడ్ డైరెక్టర్ కలిసిన మూడో మీటింగ్‌లోనే తనను రేప్ చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.,నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇద్దరు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్లలో, అగ్ర దర్శకులతో పనిచేశాను. కానీ ఎవరూ నాపై అనుచితంగా ప్రవర్తించలేదు. కానీ బాలీవుడ్‌లో డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌తో పనిచేయకుండానే అతడు మూడో మీటింగ్‌లోనే నన్ను రేప్ చేశాడు. అలాంటప్పుడు నేను సౌత్ ఇండస్ట్రీ గురించి ఎందుకు గొప్పగా చెప్పకూడదు. అంటూ పాయల్ ఘోష్ ప్రశ్నించింది.,అంతటితో ఆగకుండా జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో పనిచేశానని, ఆయన కూడా ఎప్పుడూ తనపై మిస్ బిహేవ్ చేయలేదని చెప్పుకొచ్చింది. "నేను సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌తో కూడా పనిచేశాను. ఆయన కూడా నాపై ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. అంత గొప్పమనిషి అతడు. అందుకే నాకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం." అని పాయల్ ఘోష్ తెలిపింది.,పాయల్ ఘోష్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ప్రయాణం సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది. ఈ సినిమా తర్వాత తారక్‌తో కలిసి ఊసరవెల్లి చిత్రంలో కనిపించింది. ఇది కాకుండా మిస్టర్ రాస్కెల్ అనే మరో సినిమా చేసింది. ప్రస్తుతం హిందీలో ఆమె కోయి జానే నా అనే సినిమాలో నటించింది.,,,