Nayanthara Quit Acting: సినిమాల‌కు బ్రేక్ ఇవ్వ‌నున్న న‌య‌న‌తార - కార‌ణం ఇదేనా-nayanthara to take break from acting after shahrukh khan jawan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara Quit Acting: సినిమాల‌కు బ్రేక్ ఇవ్వ‌నున్న న‌య‌న‌తార - కార‌ణం ఇదేనా

Nayanthara Quit Acting: సినిమాల‌కు బ్రేక్ ఇవ్వ‌నున్న న‌య‌న‌తార - కార‌ణం ఇదేనా

Nelki Naresh Kumar HT Telugu
Feb 24, 2023 05:49 AM IST

Nayanthara Quit Acting: అగ్ర హీరోయిన్ న‌య‌న‌తార కొన్నాళ్లు సినిమాల‌కు బ్రేక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకు గ‌ల కార‌ణాలు ఏమిటంటే...

న‌య‌న‌తార
న‌య‌న‌తార

Nayanthara Quit Acting: ద‌క్షిణాదిలో అగ్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రిగా పేరుతెచ్చుకున్న న‌య‌న‌తార జ‌వాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌తో న‌య‌న‌తార ఫుల్ బిజీగా ఉంది. జ‌వాన్ త‌ర్వాత న‌య‌న‌తార సినిమాల‌కు లాంగ్‌ బ్రేక్ తీసుకోనున్న‌ట్లు కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో స‌రోగ‌సీ ద్వారా క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది న‌య‌న‌తార‌. పెళ్ల‌యిన ఐదు నెల‌ల‌కే క‌వ‌ల పిల్ల‌ల‌కు త‌ల్లికావ‌డం వివాదానికి దారితీసింది. త‌మ‌కు ఆరేళ్ల క్రిత‌మే పెళ్ల‌యిందంటూ మ్యారేజ్ స‌ర్టిఫికెట్‌ను చూపించి లీగ‌ల్‌గానే వివాదానికి ముగింపు ప‌లికారు న‌య‌న‌తార, విఘ్నేష్‌శివ‌న్‌. పిల్ల‌ల బాధ్య‌త కార‌ణంగా కొన్నాళ్లు యాక్టింగ్‌కు దూరంగా ఉండాల‌ని న‌య‌న‌తార నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

న‌ట‌న‌కు బ్రేక్ ఇచ్చి కుటుంబ‌బాధ్య‌త‌ల‌తో పాటు పాటు త‌మ ఓన్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ రౌడీపిక్చ‌ర్స్‌కు సంబంధించిన‌ వ్య‌వ‌హారాల‌పై దృష్టిసారించాల‌నే ఆలోచ‌న‌లో న‌య‌న్ ఉన్న‌ట్లు స‌మాచారం. అందుకే ఆమె కొత్త సినిమాల‌పై సంత‌కం చేయ‌డం లేద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌స్తుతం అంగీక‌రించిన సినిమాల్ని పూర్తి చేసే ప‌నిలో న‌య‌న్‌ఉంద‌ని అంటున్నారు.

షారుఖ్‌ఖాన్ జ‌వాన్‌తో పాటు త‌మిళంలో ఇరైవ‌న్ అనే సినిమాలు చేస్తోంది న‌య‌న‌తార‌. ఈ రెండు త‌ప్ప మ‌రే సినిమాపై న‌య‌న‌తార సంత‌కం చేయ‌లేద‌ని అంటున్నారు. జ‌వాన్ సినిమా జూన్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు.

IPL_Entry_Point