తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayanthara Independence Day: స్పెయిన్‌లో మన జెండా ఎగురేసిన నయనతార, విగ్నేష్‌

Nayanthara Independence Day: స్పెయిన్‌లో మన జెండా ఎగురేసిన నయనతార, విగ్నేష్‌

HT Telugu Desk HT Telugu

15 August 2022, 20:57 IST

    • Nayanthara Independence Day: స్పెయిన్‌లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కొత్తగా పెళ్లయిన జంట నయనతార, విగ్నేష్‌ శివన్‌ ఆ దేశంలో ఇండిపెండెన్స్‌ జరుపుకోవడం విశేషం.
బార్సిలోనా వీధుల్లో త్రివర్ణ పతాకంతో విగ్నేష్, నయనతార
బార్సిలోనా వీధుల్లో త్రివర్ణ పతాకంతో విగ్నేష్, నయనతార (Twitter)

బార్సిలోనా వీధుల్లో త్రివర్ణ పతాకంతో విగ్నేష్, నయనతార

సౌతిండియా సూపర్‌స్టార్‌ నయనతార, ఆమె భర్త విగ్నేష్‌ శివన్‌ తమ దేశభక్తిని చాటుకున్నారు. సోమవారం (ఆగస్ట్‌ 15) దేశమంతా 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోగా.. స్పెయిన్‌ టూర్‌లో ఉన్న ఈ జంట మాత్రం అక్కడ త్రివర్ణ పతాకంతో సందడి చేసింది. బార్సిలోనా వీధుల్లో నయన్‌, విగ్నేష్‌ మన జెండాను చెరో వైపూ పట్టుకొని తిరిగారు.

ట్రెండింగ్ వార్తలు

NNS May 6th Episode: మిస్సమ్మపై పగ సాధిస్తున్న పిల్లలు.. అరుంధతి చివరి కోరిక.. అమర్ మాటలకు కుప్పకూలిన రామ్మూర్తి

GMV OTT Official: మారిన హారర్ కామెడీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్- అధికారిక ప్రకటన- 2 రోజుల ముందుగానే స్ట్రీమింగ్- ఎక్కడంటే?

The Goat Life OTT Release Date: ఈవారం ఓటీటీలోకి మరో మలయాళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

OTT Releases This Week: ఓటీటీలో ఈ వారం ఏకంగా 21 సినిమాలు.. ఇంట్రెస్టింగ్‌గా 7.. ఎక్కడ చూడాలంటే?

సోమవారమంతా వీళ్లు ఎటు వెళ్లినా ఇలా చేతుల్లో పతాకంతోనే కనిపించారు. అక్కడి వారికి మన దేశ గొప్పదనాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ జంట దేశభక్తిని చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో ఇక్కడ ఇండియాలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్న వేళ.. ఎక్కడో ఉన్న స్పెయిన్‌లో నయన్‌, విగ్నేష్‌ ఇలా మన పతాకాన్ని సగర్వంగా ప్రదర్శించారు.

స్పెయిన్‌కు వెళ్తున్న సమయంలో ఈ జంట ఫ్లైట్‌లో రొమాన్స్‌ చేస్తున్న ఫొటోలు కూడా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్పెయిన్‌లో హాయిగా విహరిస్తున్న ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు వీళ్లు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటున్నారు. జూన్‌ 9న వీళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు థాయ్‌లాండ్‌లో హనీమూన్‌ ఎంజాయ్‌ చేసిన తర్వాత ఎవరి షూటింగ్‌లతో వాళ్లు బిజీ అయ్యారు.

నయన్‌ ప్రస్తుతం షారుక్‌ఖాన్‌తో కలిసి జవాన్‌ మూవీలో నటిస్తోంది. పెళ్లి తర్వాత ఆమె నటిస్తున్న తొలి సినిమా ఇదే. ఆమె పెళ్లికి షారుక్‌ కూడా వచ్చాడు. ఇక ఆమె వెడ్డింగ్‌ వీడియోను ఓ డాక్యుమెంటరీగా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్‌ వచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.