Nayan and Vignesh: నయనతార పెళ్లిపై డాక్యూమెంటరీ.. టీజర్ వచ్చేసింది ఇదిగో-nayanthara and vignesh shivan wedding documentary teaser out ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nayan And Vignesh: నయనతార పెళ్లిపై డాక్యూమెంటరీ.. టీజర్ వచ్చేసింది ఇదిగో

Nayan and Vignesh: నయనతార పెళ్లిపై డాక్యూమెంటరీ.. టీజర్ వచ్చేసింది ఇదిగో

Maragani Govardhan HT Telugu
Aug 09, 2022 01:10 PM IST

జూన్ 9న నయనతార- విఘ్నేశ్ శివన్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. వీరిద్దరి వివాహంపై డాక్యూమెంటరీని తీస్తోంది నెట్‌ఫ్లిక్స్. నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ పేరుతో రానున్న ఈ సిరీస్ టీజర్‌ను విడుదల చేసింది.

నయనతార-విఘ్నేశ్ శివన్
నయనతార-విఘ్నేశ్ శివన్ (PTI)

దక్షిణాది లేడీ సూపర్‌స్టార్ నయనతార.. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం మహాబలపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అయ్యాయి కూడా. నెటిజన్లు కూడా ఈ చిత్రాలపై విశేషంగా స్పందించారు. దీంతో సదరు దంపతులు కూడా తమ వివాహ వీడియోను డాక్యూమెంటరీ రూపంలో విడుదల చేసేందుకు సిద్ధపడ్డారు. తాజాగా వీరి పెళ్లి డాక్యూమెంటరీ టీజర్‌ను విడుదల చేశారు. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో దీన్ని తీసుకొచ్చారు.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ వెడ్డింగ్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఓటీటీలోనే నయన్-విఘ్నేశ్ డాక్యూమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. టీజర్‌ను గమనిస్తే ఇద్దరూ తమ ప్రేమ నుంచి పెళ్లి వరకు గల ప్రయాణాన్ని వివరించారు. ప్రేమలో ఎలా పడ్డారు? ఒకరినొకరు ఎలా కనుగొన్నారు తదితర విషయాలను తెలిపారు.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా నయనతార బియాండ్ ది ఫెయిరీటేల్ డాక్యూమెంటరీ టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసింది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను షేర్ చేస్తూనెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ వీడియోకు క్యాప్షన్‌ను కూడా జోడించింది. "నయనతార-విఘ్నేశ్ అద్భుత కథ గురించి ఓ మ్యాజికల్ డాక్యూమెంటరీ ఇదే" అంటూ పోస్ట్ పెట్టింది.

జులై 21న నెట్‌ఫ్లిక్స్ సంస్థ నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ డాక్యూమెంటరీ గురించి అధికారికంగా ప్రకటించింది. గౌతమ్ వాసుదేవన్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యూమెంటరీని రౌడీ పిక్చర్స్ నిర్మించింది. ఈ డాక్యూమెంటరీ గురించి నెట్‌ఫ్లిక్స్ ఇండియా హెడ్ తాన్యా భూమి మాట్లాడుతూ.. "ఫ్రెష్, ఆకట్టుకునే కంటెంట్‌కు మేము నిలయం. భారత్‌తో పాటు వెలుపల ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే శక్తి ఉంది. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో నయనతార నిజమైన సూపర్‌స్టార్. మా అద్భుతమైన సృజనాత్మక భాగస్వాములు. దర్శకుడు గౌతమ్ మీనన్, రౌడీ పిక్చర్స్‌తో కలిసి నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ డాక్యూమెంటరీని చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం." అని ఆమె స్పష్టం చేసింది.

నయనతార-విఘ్నేశ్ శివన్ ఇద్దరూ జూన్ 9న వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. షారుఖ్ ఖాన్, ఏఆర్ రెహమాన్, సూర్య, రజినీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్