Happy Independence Day 2022 । అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..-happy independence day 2022 best wishes quotes images and messages ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Independence Day 2022 । అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..

Happy Independence Day 2022 । అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..

HT Telugu Desk HT Telugu
Aug 15, 2022 07:04 AM IST

Happy Independence Day 2022: బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించి, త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన రోజు.. మాతృభూమికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు వచ్చిన మధురమైన రోజు.. ఈ అమృత మహోత్సవాల సందర్భంగా అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపండి..

Happy Independence Day 2022
Happy Independence Day 2022

Happy Independence Day 2022: మన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆగస్ట్ 15, 2022 సోమవారం నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ శుభ సందర్భంగా దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. పరాయి పాలన నుంచి విముక్తి పొంది, స్వంత పాలనలో స్వతంత్ర భారతావనిలో తల ఎత్తుకొని స్వేచ్ఛగా జీవించటం మనందరికీ గర్వకారణం. ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యతను, మన దేశ చరిత్రను చాటిచెప్పటం, మన స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకోవడం భారతీయులుగా మన బాధ్యత.

ఉత్సాహంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగస్వామి అవుదాం. జనగణమన అంటూ మది పరవశించేలా జాతీయ గీతాన్ని ఆలపిద్దాం. గర్వంగా రెపరెపలాడే మన జాతీయ జెండాకు సెల్యూట్ చేద్దాం.

మీరు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడ దేశభక్తిని పెంపొందించే కొన్ని సందేశాలు, సూక్తులు, చిత్రాలు ఉన్నాయి. వీటిని మీ తోటి భారతీయులకు పంపి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపండి.

<p>Happy Independence Day 2022</p>
Happy Independence Day 2022

ఎందరో త్యాగధనుల పుణ్యఫలం స్వాతంత్య్రం.. మన స్వాతంత్య్ర సమరయోధులకు సెల్యూట్ చేస్తూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారతీయుడవని గర్వించు.. భారతీయుడిగా జీవించు.. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

<p>Happy Independence Day 2022</p>
Happy Independence Day 2022

ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున.. దేశ శాంతి, సామరస్యాలను కాపాడుతానని.. జాతి ఔన్నత్యానికి పాటుపడతానని ప్రతిజ్ఞ చేద్దాం..

<p>Happy Independence Day 2022</p>
Happy Independence Day 2022

వ్యక్తులను చంపేయగలం, కానీ వారి ఆశయాలను చంపలేం.. ఇంక్విలాబ్ జిందాబాద్.

<p>Happy Independence Day 2022</p>
Happy Independence Day 2022

తపులు చేసేందుకు స్వేచ్ఛను ఉపయోగించుకుంటే.. స్వేచ్ఛా స్వ్యాతంత్య్రాలకు విలువ ఉండదు..

భారతీయులందరికీ హిందూస్తాన్ టైమ్స్- తెలుగు తరఫున స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

WhatsApp channel

సంబంధిత కథనం