తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hbd Naveen Polishetty: స్టాండప్ కమెడియన్‌గా జాతిరత్నాలు స్టార్.. బర్త్‌డే పోస్టర్ రిలీజ్

HBD Naveen Polishetty: స్టాండప్ కమెడియన్‌గా జాతిరత్నాలు స్టార్.. బర్త్‌డే పోస్టర్ రిలీజ్

26 December 2022, 13:44 IST

    • HBD Naveen Polishetty: టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా.. అనుష్క హీరోయిన్‌గా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో నవీన్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి

నవీన్ పోలిశెట్టి

HBD Naveen Polishetty: ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ లాంటి సూపర్ హిట్‌తో హీరోగా చిత్రసీమకు పరిచయమయ్యాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా తర్వాత జాతిరత్నాలుతో మరో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది. ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాడ నవీన్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తాజాగా సరికొత్త అప్డేట్ వచ్చింది. సోమవారం నవీన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలో అతడి క్యారెక్టర్ పేరు, మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ట్రెండింగ్ వార్తలు

Prithviraj Sukumaran: ‘సలార్’పై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన పృథ్విరాజ్ సుకుమారన్.. ఎగ్జైట్ అవుతున్న ఫ్యాన్స్

Janhvi Kapoor: తిరుపతిలో పహారియాతో జాన్వీ కపూర్ పెళ్లి అంటూ రూమర్.. స్పందించిన హీరోయిన్

Rajamouli: అలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా.. చేస్తా: రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌పై ఆ ప్రశ్నకు నో కామెంట్

Netflix OTT top movies: నెట్‍ఫ్లిక్స్‌లో టాప్‍కు దూసుకొచ్చేసిన హారర్ థ్రిల్లర్ సినిమా.. రెండో ప్లేస్‍లో కామెడీ మూవీ

నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా అతడి లేటెస్ట్ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో అతడి పేరు సిద్ధు పోలిశెట్టిగా పెట్టారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను చూస్తుంటే ఇందులో నవీన్ స్టాండప్ కమెడియన్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అర్బన్ స్పోర్ట్స్ లుక్‌లో జాతిరత్నాలు స్టార్ సూపర్ స్మార్ట్‌గా ఉన్నాడు.

జాతిరత్నాలు చిత్రంలో నవీన్ కమెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ఈ సినిమాలో స్టాండప్ కమెడియన్‌గా రాబోతుండటంతో అబిమానుల్లో అంచనాలు పెరిగాయి. తన పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్తాడని అంచనాలు వేసుకుంటున్నారు.

ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టితో పాటు అనుష్క కూడా ఫీమేల్ లీడ్‌గా కనిపించనుంది. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ-ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు, విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.