తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhamaka Day 3 Collections: కలెక్షన్ల ధమాకా.. తొలి రోజును మించిన మూడో రోజు కలెక్షన్లు

Dhamaka Day 3 Collections: కలెక్షన్ల ధమాకా.. తొలి రోజును మించిన మూడో రోజు కలెక్షన్లు

Hari Prasad S HT Telugu

26 December 2022, 12:36 IST

    • Dhamaka Day 3 Collections: ధమాకా మూవీపై కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఈ సినిమా తొలి రోజు కంటే కూడా మూడో రోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం విశేషం.
ధమాకా మూవీలో రవితేజ
ధమాకా మూవీలో రవితేజ (twitter)

ధమాకా మూవీలో రవితేజ

Dhamaka Day 3 Collections: మాస్‌ మహారాజా రవితేజ లేటెస్ట్‌ మూవీ ధమాకా బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్‌ వీకెండ్‌లో ఆ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయి. అయితే తొలి రోజు కంటే కూడా ఆదివారం అయిన మూడో రోజు ధమాకాకు ఎక్కువ కలెక్షన్లు రావడం విశేషం. చాలా రోజుల తర్వాత రవితేజ మూవీకి పాజిటివ్‌ టాక్ రావడంతో అదే స్థాయిలో కలెక్షన్లు కూడా వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

తొలి రోజు ఈ సినిమా రూ.2.1 కోట్ల షేర్‌ రాబట్టింది. అదే మూడో రోజు షేర్‌ మాత్రం రూ.2.2 కోట్లు కావడం విశేషం. మూడు రోజులు కలిపి రూ.6.2 కోట్ల షేర్‌ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో ధమాకా మూవీ రూ.32 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. అయితే సోమవారం (డిసెంబర్‌ 26) నుంచి ఆ సినిమాకు అసలు పరీక్ష ఎదురు కానుంది. వీక్‌ డేస్‌లో ఎలాంటి సినిమా అయినా కలెక్షన్ల పరంగా కాస్తా డౌన్‌ అవుతుంది.

ధమాకా మూవీలో రవితేజ సరసన శ్రీలీల నటించింది. వీళ్లతోపాటు రావు రమేష్, జయరాం, తనికెళ్ల భరణి, అలీ, హైపర్‌ ఆది, పవిత్రా లోకేష్‌లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. భీమ్స్‌ సీసిరోలియో మ్యూజిక్‌ అందించాడు.

ధమాకా ఎలా ఉంది?

ఈ సినిమా మాస్ కథ కావడంతో రవి తేజ అదరగొట్టేశాడు. సినిమాలో ఆయన ఎనర్జీ కనిపిస్తుంది. రవి తేజ వన్ మ్యాన్ షోనే ఉంటుంది. శ్రీలీల యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. ఆమె వేసిన డ్యాన్స్ ఫిదా అయిపోతారు. రవితేజకు పోటీ ఇచ్చింది. మాస్ కు కావాల్సిన సాంగ్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఇచ్చేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒకే అనిపిస్తుంది. ఇతర పాత్రల్లోని నటులు సైతం చక్కగా నటించారు. కొన్ని సీన్లలో కామెడీ పండింది. రావు రమేశ్, హైపర్ ఆది కామెడీలో కొన్ని పంచ్ లు పేలతాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, భీమ్స్ మ్యూజిక్ సైతం ఆకట్టుకుంటుంది. ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన కొన్ని డైలాగ్స్ బాగున్నాయి.

కానీ సినిమా మాత్రం రోటిన్ కథ. కొన్ని సన్నివేశాలు గెస్ చేసేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో కామెడీ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో సీరియస్ లోకి వెళ్తుంది. రవి తేజ ద్విపాత్ర అభినయం కొన్నిచోట్ల గందరగోళం అనిపిస్తుంది. రొటీన్ గా కథ వెళ్తుంది. రెగ్యూలర్ ఫార్ములాతోనే సినిమాను నడింపిచేశారు. కొన్ని సినిమా స్పూఫ్ లు కూడా ఇందులో చూడొచ్చు. ఇంద్ర స్పూఫ్ వర్కవుట్ అయింది. ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. రవి తేజను ఇష్టపడే వారికి సినిమా నచ్చుతుంది. కథలో కొత్తదనం లేదు.. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే.. సినిమాను ఎంజాయ్ చేయోచ్చు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం