Anaganaga Oka Raju Teaser: రాజుగాని పెళ్లి ఇది.. నవీన్‌ పోలిశెట్టి అనగనగా ఒక రాజు టీజర్‌ అదుర్స్‌-anaganaga oka raju teaser released as naveen polishetty promised another full length comedy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anaganaga Oka Raju Teaser Released As Naveen Polishetty Promised Another Full Length Comedy

Anaganaga Oka Raju Teaser: రాజుగాని పెళ్లి ఇది.. నవీన్‌ పోలిశెట్టి అనగనగా ఒక రాజు టీజర్‌ అదుర్స్‌

HT Telugu Desk HT Telugu
Sep 14, 2022 08:48 PM IST

Anaganaga Oka Raju Teaser: రాజుగాని పెళ్లి ఇది అంటూ అనగనగా ఒక రాజు మూవీ టీజర్‌లో తెగ నవ్వించేశాడు నవీన్‌ పోలిశెట్టి. ఈ టాలీవుడ్‌ సెన్సేషన్‌ నటించిన ఈ లేటెస్ట్‌ మూవీ టీజర్‌ బుధవారం (సెప్టెంబర్‌ 14) రిలీజైంది.

అనగనగా ఒక రాజు మూవీలో నవీన్ పోలిశెట్టి
అనగనగా ఒక రాజు మూవీలో నవీన్ పోలిశెట్టి

Anaganaga Oka Raju Teaser: రాజుగాని పెళ్లిక్కడ.. ఖర్చుకు వెనుకాడొద్దు.. రాజుగాని పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో పగిలిపోవాలి.. అంటూ తనదైన స్టైల్‌ యాక్టింగ్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు నవీన్‌ పోలిశెట్టి. అతడు నటించిన అనగనగా ఒక రాజు మూవీ టీజర్‌ బుధవారం (సెప్టెంబర్‌ 14) రిలీజైంది. సుమారు రెండు నిమిషాలు ఉన్న ఈ టీజర్‌ మొత్తం తన గొప్పలు చెప్పుకునే రాజులా నవీన్‌ కనిపించాడు.

ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ గత జనవరిలోనే రిలీజైంది. అప్పుడే నవీన్‌ లుక్‌ మూవీపై ఆసక్తి రేపింది. ఇప్పుడొచ్చిన టీజర్‌ దానిని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. అప్పట్లో టైటిల్‌ టీజర్‌ కేవలం గంట వ్యవధిలోనే 30 లక్షల వ్యూస్‌ సొంతం చేసుకొని సంచలనం సృష్టించింది. కామెడీని తనదైన స్టైల్లో సులువుగా పండించే నవీన్‌ పోలిశెట్టి.. మరోసారి తనకు మాత్రమే సాధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

అనగనగా ఒక రాజు మూవీ ఒక రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. ఈ సినిమాను కల్యాణ్‌ శంకర్‌ డైరెక్ట్‌ చేశాడు. ఈ సినిమాలో నవీన్‌ పోలిశెట్టి సరసన శ్రీలీల నటిస్తోంది. ఇక మ్యూజిక్‌ను తమన్‌ అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ & ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్‌ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి.

జాతిరత్నాలు మూవీలో తన క్యారెక్టర్‌కుగాను ఈ మధ్యే సైమా అవార్డ్స్‌లో బెస్ట్‌ యాక్టర్ అవార్డు అందుకున్నాడు నవీన్‌ పోలిశెట్టి. ఇది ప్రతి సగటు మనిషికి చెందే అవార్డు అంటూ దీనిని అందుకున్న తర్వాత నవీన్‌ ఎమోషనల్‌ అయ్యాడు. సినిమా హీరో అయ్యేంత గొప్పవాళ్లం కాదని తనకు తరచూ చెప్పేవారని, కానీ ఇప్పుడిలా బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు అందుకోవడంతో తన కల నిజమైందని కూడా నవీన్‌ చెప్పాడు.

IPL_Entry_Point

టాపిక్