తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Custody Trailer Release: ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా కస్టడీ ట్రైలర్.. చై అదరగొట్టేశాడు

Custody Trailer Release: ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా కస్టడీ ట్రైలర్.. చై అదరగొట్టేశాడు

05 May 2023, 17:06 IST

    • Custody Trailer Release: నాగచైతన్య నటించిన కస్టడీ ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
కస్టడీ ట్రైలర్ రిలీజ్
కస్టడీ ట్రైలర్ రిలీజ్

కస్టడీ ట్రైలర్ రిలీజ్

Custody Trailer Release: సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరో-విలన్ మధ్య సాగే పోరాటమే ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్రతినాయకుడిని కథానాయకుడు చంపడంతో స్టోరీ ఎండ్ అవుతుంది. కానీ నాగచైతన్య నటించిన కస్టడీ మూవీ చూసేందుకు అలా అనిపించడం లేదు. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో చై నటించిన కస్టడీ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే సినిమా స్టోరీ గురించి ఓ అంచనాకు వచ్చేయొచ్చు. కానీ ప్రతి సీన్ మాత్రం ఇంటెన్స్‌గా సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేలా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

కస్టడీ రెగ్యూలర్ యాక్షన్ మూవీ కాదని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. వెంకట్ ప్రభు ఆడియెన్స్‌ను ఆద్యంతం ఎంగేజ్ చేసేలా విభిన్నమైన కథాంశంతో వచ్చినట్లు తెలుస్తోంది. నాగచైతన్య ఇందులో కస్టపడి పనిచేసే ఓ కానిస్టేబుల్ పాత్రలో నటించాడు. తన వృత్తిధర్మం కోసం ఏదైనా చేసే నిజాయితీ గల పోలీసుగా నటించాడు. ఇందులో అతడి నటనలో మెచ్యూరిటీని గమనించవచ్చు.

ఇక ట్రైలర్‌ను గమనిస్తే స్టోరీ గురించి ఓ అంచనాకు రావచ్చు. "నిజం గెలవడానికి లేట్ అవుతుంది.. కానీ కచ్చితంగా గెలుస్తుంది" అని నాగచైతన్య చెప్పే డైలాగ్ ఆసక్తిని కలిగిస్తుంది. ఆద్యంతం హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను భారీగా పెంచేలా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన కృతి శెట్టి అందంగా ఉంది. అరవింద్ స్వామి ఇందులో విలన్‌గా నటిస్తుండగా.. ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. మ్యాస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. కస్టడీ సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.