Custody Second Single: కస్టడీ నుంచి రెండో పాట విడుదల.. ఇళయరాజ కంపోజిషన్‌లో సాంగ్ అదుర్స్-second single released from naga chaitanya custody movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Custody Second Single: కస్టడీ నుంచి రెండో పాట విడుదల.. ఇళయరాజ కంపోజిషన్‌లో సాంగ్ అదుర్స్

Custody Second Single: కస్టడీ నుంచి రెండో పాట విడుదల.. ఇళయరాజ కంపోజిషన్‌లో సాంగ్ అదుర్స్

Maragani Govardhan HT Telugu
Apr 23, 2023 09:50 PM IST

Custody Second Single: నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన సినిమా కస్టడీ. ఈ మూవీ నుంచి రెండో పాట విడుదలైంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా స్వర కల్పనలో వచ్చిన ఈ టైమ్ లెస్ లవ్ ట్రాక్ ఆకట్టుకుంటోంది.

కస్టడీ నుంచి రెండో పాట విడుదల
కస్టడీ నుంచి రెండో పాట విడుదల

Custody Second Single: అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం కస్టడీ. ఈ మూవీకి కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. కస్టడీ నుంచి రెండో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైమ్ లెస్ లవ్ అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కలిసి స్వరపరిచిన అదిరిపోయింది. ఇళయరాజా ట్రాక్‌ను సమకూర్చగా.. యువన్ ఆర్కేస్ట్రా బాధ్యతలు నిర్వర్తించారు. సాక్సో ఫోన్ స్టఫ్‌తో పాటు హార్మోనియస్ రిథమ్స్ ఆకట్టుకున్నాయి.

ఈ పాటను యువన్ శంకర్ రాజా, కపిలా కపిలన్ కలిసి అద్భుతంగా ఆలపించారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రీ ఈ పాటను రాశారు. స్కూల్ డేస్ నుంచి లీడ్ పెయిర్ ప్రేమ కథ గురించి ఈ పాట ఉంటుంది. ఈ రెట్రో థీమ్ మ్యూజిక్‌తో సాంగ్ శ్రోతలను అలరిస్తోంది. గ్రాండ్‌గా ఉన్న సెట్స్‌లో నాగచైతన్య, కృతి శెట్టిలపై ఈ సాంగ్‌ను అద్భుతంగా చిత్రీకరించారు. మళ్లీ మళ్లీ వినిపించేలా ఉన్న ఈ సాంగ్ ఏజ్‌లెస్ కంపోజిషన్‌గా మారింది. సంగీత ప్రియుల మనస్సును దోచేస్తోంది ఈ సాంగ్.

నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. మ్యాస్ట్రో ఇళయరాజాతో పాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. కస్టడీ సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం.

IPL_Entry_Point