Custody Team on CSK vs SRH: సీఎస్కే vs ఎస్ఆర్‌హెచ్.. కస్టడీ డైరెక్టర్‌తో నాగచైతన్య ఫైట్
Custody team on CSK vs SRH: సీఎస్కే vs ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ కోసం కస్టడీ డైరెక్టర్‌తో నాగచైతన్య ఫైట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.

Custody team on CSK vs SRH: కస్టడీ మూవీ హీరో నాగ చైతన్య, డైరెక్టర్ వెంకట్ ప్రభు పోట్లాడుకున్నారు. ఒకరినొకరు తిట్టుకున్నారు. నువ్వెంతంటే నువ్వెంత అని అనుకున్నారు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో సింగర్, కంపోజర్ అయిన ప్రేమ్‌జీ అమరన్ జోక్యం చేసుకున్నాడు. ఇద్దరికీ నచ్చజెప్పి సయోధ్య కుదిర్చాడు.
ఇంతకీ ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? తమ కస్టడీ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ హీరో, డైరెక్టర్ ఐపీఎల్లో జరగబోయే చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ను ఉపయోగించుకున్నారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు తమిళ వ్యక్తి కావడంతో సీఎస్కే జట్టుకు, నాగ చైతన్య తెలుగువాడు కావడంతో ఎస్ఆర్‌హెచ్ జట్టుకు మద్దతుగా ఆ టీమ్స్ జెర్సీలతో ఈ వీడియోలో కనిపించారు.
నా టీమ్ గొప్పంటే నా టీమ్ గొప్ప అంటూ ఈ ఇద్దరూ వాదించుకున్నారు. ఈ మూడు నిమిషాల ప్రమోషనల్ వీడియో మొత్తం తమిళంలోనే ఉంది. ఇందులో చైతూ కూడా తమిళంలోనే మాట్లాడుతూ కనిపించాడు. చివరి వరకూ ఇద్దరూ ఎక్కడా తగ్గకపోవడంతో సింగర్ ప్రేమ్‌జీ జోక్యం చేసుకొని సర్ది చెప్పాడు. సన్ రైజర్స్ కూడా తమిళ వాళ్ల టీమే అని, ఇటు సీఎస్కేలో తెలుగువాడు అంబటి రాయుడు ఉన్నాడంటూ చెబుతాడు.
అంతేకాదు కస్టడీ మూవీ కూడా తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ రిలీజ్ అవుతోందని అంటాడు. దీంతో వెంకట్ ప్రభు, నాగ చైతన్య చేతులు కలుపుతారు. ఇప్పుడీ ప్రమోషనల్ వీడియో వైరల్ అవుతోంది. ఇక మే 12న రిలీజ్ కాబోతున్న కస్టడీ మూవీ నుంచి ఈ మధ్యే ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.
కస్టడీ మూవీలో నాగ చైతన్య పోలీస్ కానిస్టేబుల్ గా కనిపిస్తున్నాడు. ఇందులో అతని సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాతోనే వెంకట్ ప్రభు టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి కూడా నటించారు.
సంబంధిత కథనం