Naga Chaitanya Shobhita: గర్ల్‌ఫ్రెండ్‌తో మళ్లీ దొరికిపోయిన చైతూ.. ఈసారి ఏం చెబుతాడో?-naga chaitanya shobhita clicked in london dinner date
Telugu News  /  Entertainment  /  Naga Chaitanya Shobhita Clicked In London Dinner Date
చెఫ్ తో చైతన్య కెమెరాకు పోజులివ్వగా బ్యాక్‌గ్రౌండ్ లో ఉన్న శోభిత ఇలా కనిపించింది
చెఫ్ తో చైతన్య కెమెరాకు పోజులివ్వగా బ్యాక్‌గ్రౌండ్ లో ఉన్న శోభిత ఇలా కనిపించింది

Naga Chaitanya Shobhita: గర్ల్‌ఫ్రెండ్‌తో మళ్లీ దొరికిపోయిన చైతూ.. ఈసారి ఏం చెబుతాడో?

28 March 2023, 20:00 ISTHari Prasad S
28 March 2023, 20:00 IST

Naga Chaitanya Shobhita: గర్ల్‌ఫ్రెండ్‌తో మళ్లీ దొరికిపోయాడు చైతూ. మరి ఈసారి ఏం చెబుతాడో అంటూ సోషల్ మీడియా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ చైతన్య గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా?

Naga Chaitanya Shobhita: సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య చాలా అప్‌సెట్ అయ్యాడు. అతన్ని చూసి ఫ్యాన్స్ రగిలిపోయారు. సమంతపై విమర్శల వర్షం గుప్పించారు. తమ అభిమాన హీరో మరో పెళ్లి చేసుకుంటే చూడాలని ముచ్చట పడుతున్నారు. అందుకే చైతూ డేటింగ్ వార్తల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వాళ్లను ఖుషీ చేస్తూ ఆ మధ్య చైతూ మన తెలుగు నటి శోభితా ధూలిపాళతో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఈ ఇద్దరూ పట్టించుకోలేదు. అయినా తరచూ కెమెరా కంటికి చిక్కుతుండటంతో ఏదో నడుస్తోందని అభిమానులు ఫిక్సయిపోయారు. ఇప్పుడు మరోసారి చైతూ తన గర్ల్‌ఫ్రెండ్ తో దొరికిపోయాడు.

ఈ ఇద్దరూ లండన్ లో డిన్నర్ డేట్ లో ఉన్న ఫొటో అది. నిజానికి అప్పుడు చైతన్య.. శోభితతో ఉన్నట్లు అనుకోని విధంగా తెలిసింది. ఆ హోటల్ చెఫ్ చైతన్యతో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఆ సమయంలో అనుకోకుండా వెనుకాల కూర్చున్న శోభిత కూడా కనిపించింది. దీంతో వీళ్లిద్దరూ లండన్ లో డిన్నర్ డేట్ కు వెళ్లినట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. లండన్ లోని జామావర్ లో వీళ్లు డిన్నర్ డేట్ కు వెళ్లినట్లు తేలింది. అక్కడి ఛెఫ్ సురేందర్ మోహన్.. చైతన్యతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ ఫొటోను చాలా జాగ్రత్తగా గమనించి వెనుక చేత్తో ముఖాన్ని దాచుకున్న శోభితను గుర్తు పట్టేశారు. బ్యాక్‌గ్రౌండ్ లో ఉన్నది శోభితానే కదా అని ప్రశ్నించడం మొదలుపెట్టారు.

నిజానికి గతేడాది నవంబర్ లో ఈ ఇద్దరూ లండన్ లో కలిసి దిగిన ఫొటో కూడా వైరల్ అయింది. ఇద్దరూ కలిసే లండన్ కు వెకేషన్ కోసం వెళ్లారని వార్తలు వచ్చాయి. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య.. శోభితతో డేటింగ్ లో ఉన్నట్లు గతేడాది జూన్ నుంచి వార్తలు వస్తున్నాయి. హిందీలో మేడిన్ హెవెన్ అనే వెబ్ సిరీస్ తో పాపులర్ అయిన శోభిత.. ఈ మధ్యే పొన్నియిన్ సెల్వన్ 1లోనూ నటించింది.

హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె చైతూ ఇంటికి కూడా వెళ్లిందని, జూబ్లీహిల్స్ లో తాను కొత్తగా కడుతున్న ఇంటిని ఆమెకు చైతన్య చూపించాడనీ తెలిసింది. ఇప్పటి వరకూ తమ రిలేషన్‌షిప్ ను ఈ ఇద్దరూ సీక్రెట్ గానే ఉంచినా.. ఇప్పుడీ ఫొటో బయటకు రావడంతో దీనిపై ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత కథనం