Shaakuntalam Jewellery: గుణశేఖరా మజాకా.. శాకుంతలంలో సమంత నగల కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?-shaakuntalam jewellery costs the makes a whopping 14 crores
Telugu News  /  Entertainment  /  Shaakuntalam Jewellery Costs The Makes A Whopping 14 Crores
శాకుంతలంలో క్వీన్ లుక్ లో సమంత
శాకుంతలంలో క్వీన్ లుక్ లో సమంత

Shaakuntalam Jewellery: గుణశేఖరా మజాకా.. శాకుంతలంలో సమంత నగల కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా?

23 March 2023, 20:17 ISTHari Prasad S
23 March 2023, 20:17 IST

Shaakuntalam Jewellery: గుణశేఖరా మజాకా.. శాకుంతలంలో సమంత నగల కోసమే భారీగా ఖర్చు పెట్టారు. తాజాగా గురువారం (మార్చి 23) ఈ నగలన్నీ వేసుకున్న సమంత ఫొటోలు రిలీజ్ చేశారు.

Shaakuntalam Jewellery: గుణశేఖర్ సినిమాలంటే భారీతనానికి కేరాఫ్. ఒక్కడులో చార్మినార్ సెట్, అర్జున్ లో మీనాక్షి టెంపుల్ సెట్ లాంటివి ఎవరూ అంత త్వరగా మరచిపోరు. తన సినిమాలన్నింటిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకునే ఈ డైరెక్టర్.. తాజాగా శాకుంతలం మూవీలోనూ అలాంటి ప్రయత్నమే చేశాడు. ఈ సినిమాలో సమంత నగల కోసమే భారీగా ఖర్చు పెట్టారు.

శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కానుండగా.. మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. గురువారం (మార్చి 23) శాకుంతలం టీమ్.. సమంత క్వీన్ లుక్ ను పరిచయం చేశారు. ఈ సందర్భంగానే ఆమె వేసుకున్న నగలను కూడా అభిమానులకు చూపించారు. ఈ నగలన్నీ వేసుకున్న సమంత నిజంగా ఓ రాణిలాగే కనిపించింది. శాకుంతలంలో సమంత రెండు వేర్వేరు లుక్స్ లో కనిపిస్తుంది.

ఒకటి అడవిలో సింపుల్ గెటప్ లో కాగా.. మరొకటి క్వీన్ లుక్ లో. ఈ రాణి లుక్ లోనే సమంత ఏకంగా 13 మీటర్ల పొడవైన కాస్ట్యూమ్ వేసుకోవడం విశేషం. ఈ లుక్ రివీల్ చేసిన సమయంలో నగలపై తాము ఎంత శ్రమించామో వెల్లడించారు. ఈ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ నీలిమ గుణతోపాటు నటుడు దేవ్ మోహన్, హన్షితా రెడ్డి, గుణశేఖర్, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా, జువెలరీ డిజైనర్స్ నేహ, వసుంధర ఉన్నారు.

నగల కోసమే రూ.14 కోట్లు

శాకుంతలం సినిమాలో సమంత వేసుకునే నగల కోసమే మేకర్స్ ఏకంగా రూ.14 కోట్లు ఖర్చు చేయడం విశేషం. వీటిని నిజమైన బంగారం, డైమండ్స్ తో చేశారు. ఈ సినిమాలో మేనక పాత్ర కోసం రూ.6 నుంచి 7 కోట్ల విలువైన డైమండ్లు వాడినట్లు డైరెక్టర్ గుణశేఖర్ చెప్పాడు. ఈ సినిమా షూటింగ్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మహిళలు ఎంతో ఉత్సాహంగా కనిపించారని అతడు తెలిపాడు.

గుణశేఖర్ విజన్ ను రియాలిటీగా మలచడానికి నటీనటులంతా నిద్ర లేని రాత్రులు గడిపినట్లు నిర్మాత నీలిమ గుణ చెప్పింది. ఈ సినిమాలో సమంత క్వీన్ లుక్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన శాకుంతలం మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది.

సంబంధిత కథనం

టాపిక్