Shaakuntalam New Release Date: స‌మంత శాకుంత‌లం కొత్త రిలీజ్ డేట్ ఇదే -shaakuntalam new release date locked samantha mythological movie arriving theatres on april 14 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shaakuntalam New Release Date: స‌మంత శాకుంత‌లం కొత్త రిలీజ్ డేట్ ఇదే

Shaakuntalam New Release Date: స‌మంత శాకుంత‌లం కొత్త రిలీజ్ డేట్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Feb 10, 2023 02:48 PM IST

Shaakuntalam New Release Date: స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోన్న మైథ‌లాజిక‌ల్ ల‌వ్ స్టోరీ శాకుంత‌లం మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను శుక్ర‌వారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఏ రోజు ప్రేక్ష‌కుల ముందుకు రానుందంటే...

శాకుంత‌లం
శాకుంత‌లం

Shaakuntalam New Release Date: స‌మంత శాకుంత‌లం సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను శుక్ర‌వారం అనౌన్స్ చేశారు. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ వెల్ల‌డించింది. మైథ‌లాజిక్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 17న రిలీజ్ కావాల్సిఉండ‌గా థియేట‌ర్ ఇష్యూస్‌తో వాయిదాప‌డింది.

అలాగే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కొన్ని పూర్తి కాలేద‌ని స‌మాచారం. అందువ‌ల్లే సినిమా రిలీజ్‌ను వాయిదావేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ పోస్ట్‌పోన్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన రెండు రోజుల‌కే కొత్త రిలీజ్ డేట్‌ను క‌న్ఫామ్ చేశారు. ఏప్రిల్ 14న సినిమానువిడుద‌ల‌ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. శాకుంత‌లం సినిమా వాయిదా ప‌డ‌టం ఇది రెండోసారి. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అనుకున్నారు.

కానీ క‌రోణా కార‌ణంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కంప్లీట్ కాక‌పోవ‌డంతో ఫిబ్ర‌వ‌రికి పోస్ట్‌పోన్ అయింది. తాజాగా మ‌రోసారి ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ సినిమా ఏప్రిల్‌కు వెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌హాభార‌తంలోని శ‌కుంత‌ల‌, దుష్యంతుల ప్రేమ‌క‌థ‌తో ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం సినిమాను తెర‌కెక్కించారు.

ఇందులో శ‌కుంత‌ల పాత్ర‌లో స‌మంత న‌టిస్తుండ‌గా దుష్యంతుడిగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్‌మోహ‌న్ క‌నిపించ‌బోతున్నారు. మోహ‌న్‌బాబు, గౌత‌మి, ఈషారెబ్బా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ త‌న‌య అల్లు అర్హ బాల‌న‌టిగా టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్హ న‌టిస్తోంది.

త్రీడీ వెర్ష‌న్‌లో శాకుంత‌లం సినిమా రిలీజ్ కానుంది. దిల్‌రాజుతో క‌లిసి గుణ‌శేఖ‌ర్ త‌న‌య నీలిమ గుణ నిర్మిస్తోన్న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాలం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది.