Agent Promo Samantha Reaction: అఖిల్ ఏజెంట్ ప్రోమోపై స‌మంత రియాక్ష‌న్ వైర‌ల్‌-samantha comment viral on akhil agent release date promo ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Agent Promo Samantha Reaction: అఖిల్ ఏజెంట్ ప్రోమోపై స‌మంత రియాక్ష‌న్ వైర‌ల్‌

Agent Promo Samantha Reaction: అఖిల్ ఏజెంట్ ప్రోమోపై స‌మంత రియాక్ష‌న్ వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Published Feb 05, 2023 01:11 PM IST

Agent Promo Samantha Reaction:అఖిల్ హీరోగా న‌టిస్తోన్న ఏజెంట్ రిలీజ్ డేట్ ప్రోమోను శ‌నివారం రిలీజ్ చేశారు. ఈ వీడియో ప్రోమోను ఉద్దేశిస్తూ స‌మంత చేసిన కామెంట్ టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని

Agent Promo Samantha Reaction: అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ఏజెంట్ రిలీజ్ డేట్‌ను శ‌నివారం అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ వీడియో ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోకు సోష‌ల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ ల‌భిస్తోంది.

ఈ ప్రోమో వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు అఖిల్ అక్కినేని అత‌డి పోస్ట్‌కు స‌మంత స్పందించ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అఖిల్ వీడియో ప్రోమోను ఉద్దేశిస్తూ బీస్ట్ మోడ్ ఆన్ అంటూ స‌మంత కామెంట్ చేసింది. స‌మంత కామెంట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత అక్కినేని ఫ్యామిలీ దూరంగానే ఉంటూ వ‌స్తోంది స‌మంత‌. నాగ‌చైత‌న్య‌తో పాటు నాగార్జున సినిమాల‌పై ఎలాంటి పోస్ట్‌లు చేయ‌ని స‌మంత అఖిల్ సినిమాకు స‌పోర్ట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాకుండా ఏజెంట్ సినిమా స‌మంత బ‌ర్త్‌డే రోజునే రిలీజ్ కానుండ‌టం గ‌మ‌నార్హం.

ఈ వీడియో ప్రోమో లో వైల్డ్ సాలే అంటూ త‌న క్యారెక్ట‌ర్ ఎంత ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుందో హింట్ ఇచ్చాడు అఖిల్‌. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

మ‌ల‌యాళ‌ అగ్ర న‌టుడు మ‌మ్ముట్టి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌తో క‌లిసి సురేంద‌ర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Whats_app_banner