Agent Release Date: అఖిల్ ఏజెంట్ రిలీజ్ డేట్ కన్ఫార్మ్.. వైల్డ్‌గా రానున్న అక్కినేని హీరో-akhil new movie agent release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Akhil New Movie Agent Release Date Locked

Agent Release Date: అఖిల్ ఏజెంట్ రిలీజ్ డేట్ కన్ఫార్మ్.. వైల్డ్‌గా రానున్న అక్కినేని హీరో

Maragani Govardhan HT Telugu
Feb 04, 2023 03:38 PM IST

Agent Release Date: అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయనుంది.

ఏజెంట్ రిలీజ్ డేట్ ఖరారు
ఏజెంట్ రిలీజ్ డేట్ ఖరారు

Agent Release Date: అఖిల్ అక్కినేని చివరగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో కనిపించాడు. ఈ సినిమా వచ్చేసి దాదాపు ఏడాదిన్నర కావస్తుంది. ప్రస్తుతం ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఏజెంట్ మూవీ విడుదల తేదీని ప్రకటించింది.

అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమాను వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఈ వీడియోను గమనిస్తే.. అఖిల్‌ను ఓ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. చేతులు, కాళ్లు కట్టేసి.. ముఖానికి మాస్క్‌ తొడిగి చిత్రహింసలకు గురిచేస్తుంటారు. నిన్ను ఎవరు పంపారు, పోలీసా, రా(RAW) నా.. ఈ నెట్వర్క్‌లోకి ఎవరు పంపారు సాలే.. చెప్పు అంటూ ఓ వ్యక్తి అఖిల్‌ను కొడుతుంటాడు. ఇందుకు అఖిల్ ఇంటెన్స్ టోన్‌లో ఒసామా బిన్ లాడెన్, గడాఫీ, హిట్లర్ పంపారు బే అనగా.. సాలే చెప్పు అంటూ మళ్లీ కఠినంగా కొడతారు.. సాలే నహీం.. వైల్డ్ సాలే బోల్ అంటూ అఖిల్ డైలాగ్‌తో అభిమానులకు పూనకాలే వస్తాయి. ఇంతకముందెన్నడు చూడని విధంగా అఖిల్ తన రూపాన్ని మార్చుకున్నాడు. నటనలో పరిణితి, యాక్షన్ సన్నివేశాలకు తగినట్లుగా బాడీ లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేసుకున్నాడు. ఈ సినిమా తప్పకుండా అఖిల్ కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందనిపిస్తోంది.

ఏజెంట్ చిత్రాన్ని తొలుత సంక్రాంతికే విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండటంతో వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అంతేకాకుండా ఫెస్టివ్ సీజన్‌ను క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ధ్రువ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన హిప్ హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సైరా లాంటి హిస్టారికల్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.

IPL_Entry_Point