Kushi Movie Update: త్వ‌ర‌లోనే ఖుషి సెట్స్‌లో అడుగుపెట్ట‌నున్న స‌మంత - అప్‌డేట్ రివీల్ చేసిన డైరెక్ట‌ర్‌-kushi update vijay deverakonda samantha kushi movie regular shoot starts soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kushi Update Vijay Deverakonda Samantha Kushi Movie Regular Shoot Starts Soon

Kushi Movie Update: త్వ‌ర‌లోనే ఖుషి సెట్స్‌లో అడుగుపెట్ట‌నున్న స‌మంత - అప్‌డేట్ రివీల్ చేసిన డైరెక్ట‌ర్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 30, 2023 02:00 PM IST

Kushi Movie Update: స‌మంతతో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వినిపించాడు ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ‌. అతి త్వ‌ర‌లోనే ఖుషి సినిమా షూటింగ్‌ను తిరిగి మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ, స‌మంత
విజ‌య్ దేవ‌ర‌కొండ, స‌మంత

Kushi Movie Update: విజ‌య్ దేవ‌ర‌కొండ, స‌మంత జంట‌గా న‌టిస్తోన్న ఖుషి సినిమాపై వ‌స్తోన్న పుకార్ల‌కు ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ చెక్ పెట్టాడు. స‌మంత అనారోగ్యం కార‌ణంగా ఈ సినిమా షూటింగ్‌ చాలా రోజులుగా వాయిదాప‌డుతూ వ‌స్తోంది. షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతూ ఉండ‌టంతో ఖుషిని ప‌క్క‌న‌పెట్టిన ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ మ‌రో కొత్త సినిమాను మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి.

స‌మంత పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో మ‌రో మూడు, నాలుగు నెల‌ల పాటు ఖుషి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కావ‌డం అనుమాన‌మే నంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ పుకార్ల‌పై ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాణ స్పందించారు. అతి త్వ‌ర‌లోనే ఖుషి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించ‌బోతున్న‌ట్లు ట్వీట్ చేశాడు. ఎలాంటి అవాంత‌రాలు లేకుండా అంత స‌వ్యంగానే సాగుతున్న‌ట్లు పేర్కొన్నాడు. ద‌ర్శ‌కుడు ట్వీట్‌ను బ‌ట్టి చూస్తే త్వ‌ర‌లోనే స‌మంత ఖుషి సినిమా సెట్స్‌లో అడుగుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.

క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌తో ఖుషి సినిమా తెర‌కెక్కుతోంది. గ‌త ఏడాది క‌శ్మీర్‌లో దాదాపు నెల రోజుల పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాడు డైరెక్ట‌ర్‌.

ఆ త‌ర్వాత స‌మంత మ‌యోసైటిస్ బారిన ప‌డ‌టంతో షూటింగ్ వాయిదాప‌డింది. చాలా రోజుల పాటు సినిమా షూటింగ్స్‌, ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉన్న‌ది స‌మంత‌. ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి బారి నుంచి కోలుకుంటున్న ఆమె ఇటీవ‌లే శాకుంత‌లం సినిమా ప్ర‌మోష‌న్స్ ద్వారా తొలిసారి మీడియా ముందుకొచ్చింది.

ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. మ‌రోవైపు స‌మంత హీరోయిన్‌గా న‌టించిన శాకుంత‌లం సినిమా ఫిబ్ర‌బ‌రి 17న రిలీజ్ కానుంది. పౌరాణిక క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

IPL_Entry_Point