Vijay Deverakonda Parasuram Movie: గీత గోవిందం కాంబో మరోసారి కుదిరింది. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సక్సెస్ పుల్ కాంబో మూవీని ఆదివారం అనౌన్స్ చేశారు.
విజయ్, పరశురామ్ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించబోతున్నారు. దిల్‌రాజు బ్యానర్‌లో విజయ్ దేవరకొండ నటిస్తోన్న మొదటి సినిమా ఇది. ఫ్రెష్ స్క్రిప్ట్‌తో రూపొందనున్న భారీ బడ్జెట్ సినిమా ఇదని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని అనౌన్స్ చేయనున్నట్లు తెలిసింది.
మహేష్‌బాబు సర్కారువారి పాటతో గత ఏడాది పరశురామ్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత నాగచైతన్యతో నాగేశ్వరరావు పేరుతో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.
కానీ స్క్రిప్ట్ విషయంలో నాగచైతన్య, పరశురామ్ మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. నాగచైతన్య సినిమాను పక్కనపెట్టిన పరశురామ్ విజయ్ దేవరకొండకు కథను వినిపించినట్లు చెబుతున్నారు.
పరశురామ్ చెప్పిన లైన్ నచ్చడంతో విజయ్ ఈ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.
హీరోయిన్ సమంత మయోసైటిస్ బారిన పడటంతో చాలా రోజుల పాటు వాయిదాపడిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. అలాగే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో మరో సినిమాను అంగీకరించాడు విజయ్ దేవరకొండ. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈసినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.